Andhra Pradesh: జగన్ సర్కార్ స్థానిక డెయిరీల కంటే ‘అమూల్’కే ప్రాధాన్యమిస్తోందా? ఏపీ ప్రభుత్వం వివరణ ఇదే
అమూల్ సంస్థకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందంటూ కొన్ని మీడియా వర్గాలు కథనాలు ప్రచురితం చేశాయి. స్థానికంగా ఉన్న పాల కంపెనీల కంటే అమూల్‌కే జగన్ సర్కార్ ప్రాధాన్యమిస్తున్నట్లు ఆరోపించాయి. అలాగే ఏపీడీడీసీఎఫ్‌కు చెందిన ఆస్తులను ప్రభుత్వం నామమాత్రపు ధరకు అమూల్ సంస్థకు అప్పగిస్తూ అమూల్ ఏజెంట్‌గా వ్యవహరిస్తోందనేలా ఈ కథనాలు ఉన్నాయి.

ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్ పాలతో పాటు, వాటి ఉత్పత్తులు మాకొద్దంటూ ఇటీవల కొన్ని రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాంటి అమూల్ సంస్థకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందంటూ కొన్ని మీడియా వర్గాలు కథనాలు ప్రచురితం చేశాయి. స్థానికంగా ఉన్న పాల కంపెనీల కంటే అమూల్‌కే జగన్ సర్కార్ ప్రాధాన్యమిస్తున్నట్లు ఆరోపించాయి. అలాగే ఏపీడీడీసీఎఫ్‌కు చెందిన ఆస్తులను ప్రభుత్వం నామమాత్రపు ధరకు అమూల్ సంస్థకు అప్పగిస్తూ అమూల్ ఏజెంట్‌గా వ్యవహరిస్తోందనేలా ఈ కథనాలు ఉన్నాయి. వీటిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈ కథనాలను తోసిపుచ్చింది. ఈ మేరకు ఏపీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా అసలు విషయాలను వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం.. పాదయాత్రలో ఇచ్చిన హమీ ప్రకారం.. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పాడి సహకార సంఘాలను పునరిద్దరించారు. అలాగే పాడి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు పలు ప్రణాళికలు రూపొందించారు. మహిళల ఆర్థిక సాధికారత, మొత్తం డెయిరీ అభివృద్ధి కార్యకలాపాలను బలోపేతం చేయడం, పాల ఉత్పత్తిదారులకు లాభదాయకమైన పాల ధరలను అందించడం, వినియోగదారులకు డబ్బుకు విలువతో నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను అందించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని డెయిరీ కోఆపరేటివ్‌ల పునరుద్ధరణ కోసం గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (అమూల్) తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
AP Coop డిపార్ట్ మెంట్ కింద మహిళా పాడి రైతులతో పాలు సేకరించే అన్ని గ్రామాల్లో మహిళా డెయిరీ సహకార సంఘాల (MDSS) ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. 1967 సొసైటీస్ చట్టం ప్రకారం.. MDSS కోసం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలతో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. మహిళా పాడి రైతులకు పశు సేకరణ కార్యకలాపాలకు రుణాలు / సబ్సిడీ, పాల జంతు ఉత్పాదకత పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. డెయిరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు & అమూల్ పార్లర్ల ఏర్పాటుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. పాడి రైతులకు ఆర్‌బీకేల ద్వారా ఖర్చుకు తగ్గట్టుగా ఇన్‌పుట్‌లు అందిస్తున్నారు. పాల సేకరణ ప్రక్రియలో మధ్యవర్తి దళారులను తొలగిస్తూ మహిళా పాడి రైతులకు మెరుగైన లాభాలు అందించేలా కృషి చేసింది. ఇక జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టు కింద పాడి రైతులకు ప్రతి 10 రోజులకు ఒకసారి కొనుగోలు చేసిన పాలకు లాభదాయకమైన ధరను వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా చెల్లించడంతోపాటు సొసైటీ లాభం నెలకు ఒకసారి MDSSకి చెల్లిస్తున్నారు. మధ్యవర్తుల (లేదా) వాటాదారుల ప్రమేయం లేకుండా ప్రోత్సాహకాలు, లాభాలు, బోనస్‌లన్నీ పాడిరైతులకే అందేలా చర్యలు తీసుకున్నారు.
రాష్ట్రంలోని పాల కంపెనీల అభివృద్ధి, పాడి రైతుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టిందో ఈ లింక్‌లో చూడండి.




మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..