Andhra Pradesh: ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపుపై సజ్జల కీలక ప్రకటన.. కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్లే అలా జరిగిందంటూ..

ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించారని వస్తున్న వార్తలు అవాస్తవమని  సజ్జల స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇవ్వడమే తప్ప తొలగించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు.

Andhra Pradesh: ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపుపై సజ్జల కీలక ప్రకటన.. కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్లే అలా జరిగిందంటూ..
Sajjala Ramakrishna Reddy
Follow us

|

Updated on: Dec 05, 2022 | 3:29 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తుందంటూ వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికే పంచాయతీ రాజ్‌ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలిచ్చారని కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలు ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను కలవరపాటుకు గురిచేశాయి. తాజాగా ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సందించారు. ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించారని వస్తున్న వార్తలు అవాస్తవమని  సజ్జల స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇవ్వడమే తప్ప తొలగించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఇక పంచాయతీరాజ్‌ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలిచ్చారని.. దీనిపై సీఎం జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్ వలన కింది స్థాయిలో ఆ ఆర్డర్ వచ్చి ఉంటుందని, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపును ఉపసంహరించుకోవాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు సజ్జల తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని సజ్జల పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2.40 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందనే వార్తలు ఉద్యోగ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ జేఏసీ అమరావతి, ఉద్యోగ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే కీలక ప్రకటన చేశారు సజ్జల

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!