Pawan Kalyan: 2024లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? ఒక్క సీటు.. వంద అనుమానాలు..
పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక.. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో ఒక హాట్ టాపిక్. ఇక్కడి నుంచి గతంలో జనసేనాని పవన్ పోటీ చేయగా.. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ బరిలోకి దిగారు. ఇక వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.
ఏపీలో ఇప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. అయితే సర్వత్రా ఆసక్తిని నెలకల్పింది మాత్రం జనసేన పవన్ కళ్యాణ్ నిర్ణయం.. పోటీ చేసే సీటు.. అవును జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీకి దారేది? గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది అందిరిలోనూ ఉదయిస్తున్న ప్రశ్న? గాజువాక కేంద్రంగా హీటెడ్ సీటు పాలిటిక్స్ కొనసాగుతున్నాయి.
పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక.. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో ఒక హాట్ టాపిక్. ఇక్కడి నుంచి గతంలో జనసేనాని పవన్ పోటీ చేయగా.. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ బరిలోకి దిగారు. ఇక వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారికి తిప్పలకు నో టికెట్.. అంటూ వైసీపీ సర్కార్ గ్యారంటీగా చెబుతోంది. ఈసారి టీడీపీ, జనసేన పొత్తు ఉంటుంది కాబట్టి.. మీకు సీటు ఇవ్వడం లేదని అధినేత జగనే స్వయంగా చెప్పడంతో.. తిప్పల ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది.
ఇక పోతే.. టీడీపీ తరఫున పల్లాశ్రీనివాస్ పోటీకి రెడీ అంటున్నారు. అయితే పొత్తులో భాగంగా.. ఇక్కడ పవన్ కల్యాణే పోటీ చేస్తే మీ పరిస్థితి ఏంటని టీవీ9 అడగ్గా ఆయన మాత్రం పార్టీ డెసిషనే ఫైనల్ గా చెప్పుకొచ్చారు.
ఇంతకీ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తారా? ఆయనకీ నియోజకవర్గంపై అంత ఇంట్రస్ట్ ఉందా? అన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా సమయమున్నా.. ఇప్పటి నుంచే ఈ చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ పోటీకి దారేది? అంటూ జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి.
2024 ఎన్నికల్లో పవన్ కాకినాడ రూరల్ గానీ పిఠాపురం కానీ పోటీ చేసే అవకాశాలు లేక పోలేదని అంటున్నారు. అలాగే పాలకొల్లు నుంచి పోటీ చేసినా చేయవచ్చనే మాట వినిపిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ మనసులో మాట ఎలా ఉందో తెలియాల్సి ఉందంటున్నారు ఉత్తరాంధ్ర రాజకీయవర్గాల వారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..