AP Polling: కమాండ్ కంట్రోల్ రూం నీడలో పోలింగ్.. ఎన్నికల సిబ్బందికి ఎన్నికల అధికారి దిశా నిర్ధేశం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. పోలింగ్‌కు సంబంధించి సుమారు పదివేల మందికి పైగా పోలీసులతోపాటు.. 45 వేలకు పైగా పోలింగ్ సిబ్బందిని నియమించారు. అలాగే.. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

AP Polling: కమాండ్ కంట్రోల్ రూం నీడలో పోలింగ్.. ఎన్నికల సిబ్బందికి ఎన్నికల అధికారి దిశా నిర్ధేశం
Madhavilatha Collector
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 12, 2024 | 8:42 PM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. పోలింగ్‌కు సంబంధించి సుమారు పదివేల మందికి పైగా పోలీసులతోపాటు.. 45 వేలకు పైగా పోలింగ్ సిబ్బందిని నియమించారు. అలాగే.. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పోలింగ్‌ అధికారులు జిల్లా పోలీస్ కార్యాలయంలో వీక్షించనున్నారు.

ఇక తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్‌ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మాధవి లత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లి నియోజక వర్గాలలో నియమించిన 14 బృందాల పని తీరును పర్యవేక్షించి తగిన సూచనలు చేశారు. పొలింగ్ ప్రక్రియలో భాగంగా ఉదయం 5.30 గంటల నుంచి మాక్ పోల్, అనంతరం ఉదయం 7 గంటలకి పొలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలు, ప్రతి రెండు గంటలకు పోలైన ఓట్ల వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. పీడీఎమ్‌ఎస్ యాప్ ద్వారా పీవో, ఏపీవోలు ప్రతి రెండు గంటలకు యాప్‌లో ఆ పొలింగ్ కేంద్రంలో పాలైన ఓట్ల వివరాలు అప్లోడ్ చేయాలని సూచించారు. ఏదైనా పొలింగ్ కేంద్రంలో నిర్ణీత సమయంలో నమోదు కానీ ప్రాంతాల సెక్టార్ అధికారులు, మైక్రో అబ్జర్వర్స్‌లతో నేరుగా సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లాలోని 1,577 పోలింగు కేంద్రలకు అనుసంధానం చేయడం జరిగిందన్నారు ఎన్నికల అధికారి మాధవి లత. ఇక్కడ నుంచి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పోలింగ్ కేంద్రాల లోపల, బయట కూడా పరిశీలించే అవకాశం ఉందని తెలిపారు. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే ఆయా పోలింగు కేంద్రాలకు చేరడం జరిగిందన్నారు. మొదట రాజకీయ పార్టీల ఏజెంట్స్ సమక్షం లో మాక్ పోల్ జరిగే ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. ఏదైనా సమస్య ఉత్పన్నం అయితే వెంఠనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని రావాలని ఆదేశించారు.

కమాండ్ కంట్రోల్ రూం లో విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సమయ పాలన పాటించడం, పొలింగ్ ముగిసే వరకు ప్రతి ఒక్క విషయంలో ఖచ్చితత్వం పాటించాలని స్పష్టం చేశారు కలెక్టర్ మాధవి లత. అంతకు ముందు రాజమండ్రీ నన్నయ్య యూనివర్సిటీలో ఎన్నికల సిబ్బందికి చెందిన నియోజక వర్గ డేటా సేకరణ, స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్, వెబ్ కాస్టింగ్ మెటీరియల్ చెక్ లిస్టు ప్రకారం అందజేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు