AP Corona Cases: ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయంటే.!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 96,121 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 4147 పాజిటివ్ కేసులు..

AP Corona Cases: ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయంటే.!
Coronavirus Cases In AP
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 26, 2021 | 5:57 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 96,121 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 4147 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,75,622కి చేరింది. ఇందులో 46,126 యాక్టివ్ కేసులు ఉండగా.. 18,16,930 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో 38 మంది ప్రాణాలు విడిచారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 12,566కు చేరుకుంది.

ఇక గడిచిన 24 గంటల్లో 5773 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 2,16,37,606 సాంపిల్స్‌ను పరీక్షించారు. నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 180, చిత్తూరు 569, తూర్పుగోదావరి 838, గుంటూరు 321, కడప 226, కృష్ణా 310, కర్నూలు 160, నెల్లూరు 196, ప్రకాశం 289, శ్రీకాకుళం 128, విశాఖపట్నం 229, విజయనగరం 130, పశ్చిమ గోదావరి 571 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

Also Read:

ఈ పండుతో డయాబెటీస్‌కు చెక్ పెట్టొచ్చు.. ప్రపంచంలోనే తియ్యటి ఫ్రూట్.. ప్రత్యేకత ఇదే.!

ఈ కొండచిలువను చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. వీడియో చూస్తే మీరు ఫిదా కావాల్సిందే.!

వీడెవడండీ బాబు.! ‘క్రిస్ గేల్’ తమ్ముడులా .. 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు..

చెట్టు తొర్రలో భారీ గుడ్లు.. వాటిని పగలగొట్టి చూడగా స్థానికులు హడల్.!