CM Janan: వారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ రోజున ఖాతాల్లో నిధులు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 23న సీఎం జగన్ ఉరవకొండలో పర్యటిస్తారు. డ్వాక్రా మహిళా సంఘాల ఖాతాల్లో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత నిధులను జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.

అనంతపురం, జనవరి 22: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 23న సీఎం జగన్ ఉరవకొండలో పర్యటిస్తారు. డ్వాక్రా మహిళా సంఘాల ఖాతాల్లో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత నిధులను జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. 2019 ఏప్రిల్ 11 నాటికి బకాయిలున్న రుణాలన్నీ నాలుగు విడతల్లో డ్వాక్రా మహిళలకు నేరుగా అందజేస్తానని పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు సీఎం జగన్.. వైఎస్సార్ ఆసరా పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తున్నారు. నిర్దేశించిన గడవు నాటికి డ్వాక్రా మహిళా సంఘాలకు మొత్తం రూ. 25,570 కోట్ల రూపాయల అప్పు ఉండగా.. ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.19,175 కోట్ల రూపాయలను సీఎం జగన్ మహిళల ఖాతాల్లో జమ చేశారు.
జనవరి 23న నాల్గవ విడతలో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో రూ. 6,394 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో ఇచ్చిన మాట మేరకు గత ఎన్నికల నాటికి బకాయి పడిన రూ. 25,570 కోట్ల రూపాయలను పొదుపు సంఘాల ఖాతాల్లో జమచేయనున్నారు. మొత్తం 79 లక్షల మంది మహిళలు లబ్ది పొందనున్నారు. ఈనెల 23న ఉదయం10:30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉరవకొండకు చేరుకుంటారు. ఉదయం10.50 గంటలకు ఉరవకొండ బైపాస్ రోడ్డు సమీపంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం బటన్ నొక్కి వైఎస్సార్ ఆసరా పథకం నిధులను విడుదల చేయనున్నారు. ఉరవకొండలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సీఎం జగన్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ గౌతమి తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




