CM Jagan: విష‌మ పరిస్థితుల్లో డాక్ట‌ర్.. వెంట‌నే స్పందించి రూ. కోటి విడుద‌ల చేసిన సీఎం జ‌గ‌న్

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన ప్రభుత్వ డాక్టర్ చికిత్స కోసం కోటి రూపాయల విడుద‌ల చేయాల‌ని..

CM Jagan: విష‌మ పరిస్థితుల్లో డాక్ట‌ర్.. వెంట‌నే స్పందించి రూ. కోటి విడుద‌ల చేసిన సీఎం జ‌గ‌న్
Cm Jagan
Follow us

|

Updated on: Jun 05, 2021 | 11:31 AM

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన ప్రభుత్వ డాక్టర్ చికిత్స కోసం కోటి రూపాయల విడుద‌ల చేయాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే మ‌రికొంత మొత్తం కూడా రిలీజ్ చేయాల‌ని సూచించారు. కరోనా రోగులకు వైద్యం అందజేస్తూ.. అదే మహమ్మారికి చిక్కిన భాస్కరరావు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడైనందున తక్షణం వాటిని మార్చాలని డాక్టర్లు సూచించారు. ఇందుకోసం ఏకంగా కోటిన్నర వరకు ఖర్చవుతుందని చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో డాక్టర్‌ భాస్కరరావు కుటుంబ సభ్యులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వైద్యుడి బంధువులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి పరిస్థితి వివరించారు. ఈ విషయాన్ని మంత్రి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన సీఎం… భాస్కరరావు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి కోటి రూపాయలు విడుదల చేయించారు. అవసరమైతే మిగిలిన 50 లక్షలు కూడా అందజేసేందుకు ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రి బాలినేని వారికి తెలిపారు. డాక్టర్‌ బాస్కర్‌రావు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వారికి భరోసా కల్పించారు. భాస్కరరావు కుటుంబసభ్యులు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

కాగా శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన డాక్టర్‌ ఎన్‌.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలతో సుమారు 6 వేల మందికి కరోనా టెస్టులు చేశారు. పాజిటివ్‌గా తేలిన వారికి చికిత్స అందించి.. వారికి ధైర్యం నూరిపోశారు. ఆయన అందించిన వైద్యంతో వేలాది మంది కోవిడ్‌ బారినుంచి కోలుకున్నారు. ఈ క్ర‌మంలో ఏప్రిల్‌ 24న ఆయనకు కరోనా సోకింది. నెలాఖరు వరకు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి వైద్యం పొందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో భార్య డాక్టర్‌ భాగ్యలక్ష్మి ఆయనను విజయవాడ ఆయుష్‌ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ 10 రోజుల ట్రీట్మెంట్ అనంత‌రం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ యశోదా ఆస్ప‌త్రి, తరువాత గచ్చిబౌలిలోని కేర్‌ హాస్పిటల్‌కి త‌ర‌లించారు. ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అవ్వ‌డంతో.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుండటంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఆయనకు ఊపిరితిత్తులు మార్చాలని తేల్చిన వైద్యులు అందుకు రూ.1.50 కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. ఈ విష‌యం త‌న‌కు తెలియ‌డంతో స్పందించిన సీఎం జ‌గ‌న్ వెంట‌నే కోటి విడుద‌ల చేశారు.

Also Read: భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి ట్విట్ట‌ర్ బ్లూ టిక్ తొల‌గించిన యాజ‌మాన్యం.. కార‌ణం ఏమై ఉంటుంది?

ఆ దేశంలో ట్విట్టర్‌‌ బ్యాన్… దేశాధ్యక్షుడి ట్వీట్‌ను డెలీట్ చేసిన రెండ్రోజుల్లోనే..