RRR : AP CID అడిషినల్ డీజీకి లీగల్ నోటీసులు పంపించిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు
తనను అరెస్ట్ చేసిన సమయంలో సీఐడీ పోలీసులు తన ఐఫోన్ ను స్వాధీనం చేసుకున్నారని.. అయితే, స్వాధీనం చేసుకున్న ఐఫోన్ ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదని రఘురామ..
MP Raghurama Krishna Raju : AP CID అడిషినల్ డీజీపీ కి లీగల్ నోటీసులు పంపించారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. ఇటీవల అరెస్ట్ సమయంలో సీఐడీ పోలీసులు తన ఫోన్ తీసేసుకున్నారన్న రఘురామ.. దాంట్లో విలువైన సమాచారం ఉందని వెల్లడించారు. అంతేకాక, ఆ ఫోన్ లో కుటుంబీకుల వ్యక్తిగత వివరాలున్నాయని చెప్పిన ఆయన.. ఫోన్ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ మేరకు రఘురామ తరపు న్యాయవాది ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు. తనను అరెస్ట్ చేసిన సమయంలో సీఐడీ పోలీసులు తన దగ్గర తీసుకున్న వస్తువులు.. మెజిస్టేట్ వద్ద జమచేయాలని రఘురామ కోరారు.
తనను అరెస్టు చేసిన సమయంలో సీఐడీ పోలీసులు ఇతర అంశాలతో పాటు మొబైల్ కోడ్ ఓపెన్ చేయాలని కస్టడీలో హింసించినట్లు కూడా నోటీసుల్లో రఘురామ పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేసిన సమయంలో సీఐడీ పోలీసులు తన ఐఫోన్ ను స్వాధీనం చేసుకున్నారని.. అయితే, స్వాధీనం చేసుకున్న ఐఫోన్ ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదని రఘురామ ఆరోపించారు.
పార్లమెంటులో తాను స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నానని, ఫోన్ లో దానికి సంబంధించిన విలువైన సమాచారం కూడా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంటు విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఫోన్ తిరిగివ్వాలని విజ్ఞప్తి చేశారు. తన ఫోన్ ను అప్పగించకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. ఈ మేరకు మంగళగిరి సీఐడీ హెచ్ఎస్ఓకు లీగల్ నోటీసులిచ్చారు రఘరామకృష్ణరాజు.
Read also : Venkaiah Naidu : ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకమని వెంకయ్య నాయుడు పిలుపు