AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Droupadi Murmu: ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఘన స్వాగతం పలికిన గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్..

భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా పర్యటిస్తున్నారు. ఆదివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం జగన్ ఘన స్వాగతం పలికారు.

Droupadi Murmu: ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఘన స్వాగతం పలికిన గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్..
Droupadi Murmu Ap Tour
Shaik Madar Saheb
|

Updated on: Dec 04, 2022 | 11:38 AM

Share

President Droupadi Murmu AP Tour: భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా పర్యటిస్తున్నారు. ఆదివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనంతో రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము.. ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా పోరంకికి బయలుదేరనున్నారు. మురళి కన్వేన్షన్‌లో ఏపీ ప్రభుత్వం నిర్వహించే పౌర సన్మాన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.

అనంతరం.. రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఏర్పాటు చేసిన.. అధికారిక విందు కార్యక్రమంలో పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం, సోమవారం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పర్యటనలో ముర్ము పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. సాయంత్రం విశాఖపట్నంలో జరిగే నేవీ డే వేడుకల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం విజయవాడలో, సాయంత్రం విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..