AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: బటన్లు నొక్కడం తప్ప చేసేందేమీ లేదు.. జగన్ ప్రభుత్వ పాలనపై జీవీఎల్ కౌంటర్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బటన్లు నొక్కడం తప్ప చేసిందేమీ లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, టీడీపీ వల్ల రాష్ట్రం..

Andhra Pradesh: బటన్లు నొక్కడం తప్ప చేసేందేమీ లేదు.. జగన్ ప్రభుత్వ పాలనపై జీవీఎల్ కౌంటర్..
Gvl
Ganesh Mudavath
|

Updated on: Dec 04, 2022 | 11:42 AM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బటన్లు నొక్కడం తప్ప చేసిందేమీ లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, టీడీపీ వల్ల రాష్ట్రం అభివృద్ధి జరగలేదన్న జీవీఎల్.. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో పరిపూర్ణ అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఒంగోలు లో మాట్లాడిన ఆయన.. కేవలం ప్రకాశం జిల్లాకు మాత్రమే కాదని, ఆంధ్ర, రాయలసీమ జిల్లాలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు కేంద్రం పదేళ్ల క్రితమే నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌(నిమ్జ్‌) ప్రకటించిన విషయాన్ని జీవీఎల్ గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా పక్కన పెట్టిందని మండిపడ్డారు. ప్రకాకం జిల్లాలో నిమ్స్ ఏర్పాటు వల్ల మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు వాటంతటవే వస్తాయని, దీని ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యేవని చెప్పారు. కానీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల జిల్లా అభివృద్ధిలో వెనకబడి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బటన్‌ నొక్కడం, భజన చేయడం తప్పా రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ లేదు. రాష్ట్రానికి కొత్తగా చేసిందేమీ లేదు. తాగు, సాగునీటి సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వెలిగొండ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.1,500 కోట్లు కావాలి. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వని ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు ఇస్తోంది. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టునూ విస్మరించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఈ సమస్యలన్నీ తీరతాయి.

– జీవీఎల్ నరసింహరావు, బీజేపీ ఎంపీ

ఇవి కూడా చదవండి

మరోవైపు.. ఢిల్లీ మద్యం కేసులో దోషులు ఎంతటివారైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. సౌత్ ఇండియన్స్ పై నార్త్ ఇండియన్స్ కుట్ర చేస్తున్నారన్న వార్తలను ఆయన ఖండించారు. అసత్య ప్రచారం చేస్తూ అసలు విషయాన్ని పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ కఠోర వాస్తవాలు బయటపడుతున్నాయని జీవీఎల్ స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..