Delhi Liquor Scam: తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ హీట్.. సీబీఐ విచారణకు కవిత హాజరుపై సర్వత్రా ఉత్కంఠ..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితకు నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్రలో భాగమని గులాబీ శ్రేణులు ఆరోపిస్తుంటే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కౌంటర్ ఇస్తున్నారు కాషాయం పార్టీ పెద్దలు. సీనులోకి ఎంటర్‌ అయిన కాంగ్రెస్..

Delhi Liquor Scam: తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ హీట్.. సీబీఐ విచారణకు కవిత హాజరుపై సర్వత్రా ఉత్కంఠ..
Mlc Kavitha
Follow us

|

Updated on: Dec 03, 2022 | 9:42 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితకు నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్రలో భాగమని గులాబీ శ్రేణులు ఆరోపిస్తుంటే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కౌంటర్ ఇస్తున్నారు కాషాయం పార్టీ పెద్దలు. సీనులోకి ఎంటర్‌ అయిన కాంగ్రెస్.. లిక్కర్ స్కామ్‌లో కవితను, సిట్‌ కేసులో బీఎల్‌ సంతోష్‌ను అరెస్టు చేయాలంటోంది. ఈ క్రమంలో.. డిసెంబర్ 6న సీబీఐ విచారణకు కవిత వెళ్తారా..? ఒకవేళ వెళితే.. అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారనే దానిపైనే ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఇలాంటి టైమ్‌లో తనకు నోటీసులు ఇచ్చిన సీబీఐకి ప్రతిస్పందనగా కవిత లేఖ రాశారు. ఒరిజినల్ ఫిర్యాదు కాపీ, దాని ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీ తనకు ఇవ్వాలని కోరారు. అవి ఇచ్చిన తర్వాతే వివరణ ఇచ్చేందుకు డేట్‌ ఫిక్స్ చేయాలంటూ సీబీఐ అధికారి అలోక్‌ షాహీకి కవిత లెటర్ పంపారు.

వాస్తవానికి లిక్కర్ స్కామ్ కేసులో వచ్చిన ఆరోపణలపై వివరణ కావాలని కవితకు నిన్న నోటీసులు ఇచ్చింది సీబీఐ. ఈ నెల ఆరున.. ఢిల్లీలో అయినా, హైదరాబాద్‌లో అయినా సరే ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ వివరణ ఇవ్వాలని సూచించింది. ఆ రోజు తన ఇంట్లోనే వివరణ ఇస్తానన్న కవిత.. ఆరోపణలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగారు.

మరోవైపు, ఇదే అంశంపై దర్యాప్తు సంస్థల తీరును కాంగ్రెస్ తప్పుబడుతోంది. కవితను ఇంట్లో విచారించడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎంత పెద్దవ్యక్తులైనా కార్యాలయాల్లోనే విచారించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. టీఆర్ఎస్‌-బీజేపీ క్విడ్‌ కో ప్రో నడుస్తుందన్నారు రేవంత్‌ రెడ్డి.

ఇవి కూడా చదవండి

మహిళ అంటూ కేసీఆర్‌ సెంటిమెంట్‌ ప్రయోగించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు బండి సంజయ్‌. పంజాబ్‌, ఢిల్లీ లిక్కర్‌ పాలసీల్లో జరిగిన అవినీతిలో కేజ్రీవాల్‌తో పాటు కేసీఆర్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌కు భాగస్వామ్యం ఉందన్నారు బీజేపీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్.

మొత్తానికి కవితకు CBI అధికారుల నోటీసుల నేపథ్యంలో అందరి ఫోకస్‌ ఇక్కడే ఉంది. ఇందులో ఇంకా ఎలాంటి మలుపులుంటాయో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.