CM Jagan: కడపలో బిజిబిజీగా సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.. నేటి పూర్తి షెడ్యూల్ ఇదే
రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ (డిసెంబర్ 24) ఇడుపుల పాయకు వెళ్లనున్నారు జగన్. అక్కడ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం నెమళ్ల పార్క్‌లోని ప్రేయర్ హాల్‌లో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపలో బిజిబిజీగా గడుపుతున్నారు. మొత్తం మూడు రోజుల పర్యటనలో భాగంగా జిల్లాలోని కమలాపురం, పులివెందుల, కడప నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. కాగా రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ (డిసెంబర్ 24) ఇడుపుల పాయకు వెళ్లనున్నారు జగన్. అక్కడ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం నెమళ్ల పార్క్‌లోని ప్రేయర్ హాల్‌లో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరుకానున్నారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేత ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అనంతరం హెలికాప్టర్‌లో పులివెందుల చేరుకుంటారు. విజయ హోమ్స్ సమీపంలో నూతనంగా నిర్మించిన రింగ్ రోడ్డును ప్రారంభించనున్నారు. అనంతరం పులివెందుల కదిరి రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే పాత కూరగాయల మార్కెట్ స్థానంలో నూతనంగా అత్యాధునికంగా నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించనున్నారు.
అలాగే మైత్రి లే అవుట్ వద్ద నూతనంగా నిర్మించిన వైఎస్సార్ పార్క్‌ను ప్రారంభిస్తారు. అలాగే నూతన రాయలాపురం కేబుల్ బ్రిడ్జితో పాటు నూతనంగా ఆధునిక హంగులతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆర్టీసి ప్రాంగణంలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొననున్నారు. అనంతరం నాడు నేడు అభివృద్ధి పనుల కింద నూతనంగా నిర్మించిన అహోబిలపురం స్కూల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే మురుగు నీటి శుద్ధ కేంద్రం, గార్బేజ్ ట్రాన్స్ఫర్ సర్వీస్‌ను ప్రారంభించనున్నారు. వీటి తర్వాత పులివెందుల నుంచి బయల్దేరి ఇడుపులపాయ చేరుకుంటారు. రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లోనే బస చేయనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..