Andhra Pradesh: అందుకే కంటే కూతుర్నే కనాలనేది.. కుమారుడు నిరాకరించడంతో తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె

సాధారణంగా మన హిందూ సంప్రదాయంలో ఎవరైనా చనిపోతే వారి కుమారులే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఒకవేళ వారికి మగపిల్లలు లేకపోతే బంధువుల్లో ఎవరైనా కర్మకాండలు నిర్వహిస్తారు.

Andhra Pradesh: అందుకే కంటే కూతుర్నే కనాలనేది.. కుమారుడు నిరాకరించడంతో తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
Daughter In Father Funeral
Follow us

|

Updated on: Dec 24, 2022 | 10:35 AM

సాధారణంగా మన హిందూ సంప్రదాయంలో ఎవరైనా చనిపోతే వారి కుమారులే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఒకవేళ వారికి మగపిల్లలు లేకపోతే బంధువుల్లో ఎవరైనా కర్మకాండలు నిర్వహిస్తారు. అలాగే మహిళలను ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంచుతారు. అయితే అన్ని రంగాల్లో దూసుకెళుతోన్న మహిళలు కుమారులుగా మారి తమ తల్లిదండ్రులకు తలకొరివి పెడుతున్నారు. కుమారులు లేని కుటుంబాల్లో అన్నీ తామై అంతిమ సంస్కారాలు జరుపుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. కొడుకు ఉన్నప్పటికీ కుటుంబ సమస్యల నేపథ్యంలో ఏర్పడిన మన స్పర్థల కారణంగా తండ్రికి కర్మకాండలు చేసేందుకు నిరాకరించాడు. దీంతో కూతురే తన తండ్రికి కర్మకాండలు నిర్వహించింది. బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని నాయినపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని పోలేరమ్మ దేవస్థానం దగ్గర నివాసం ఉండే సూరిశెట్టి సాంబశివరావు కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. ఆయనకు కుమార్తె, కుమారుడు సంతానం కాగా, ఇద్దరికీ వివాహం చేశాడు. కుమారుడు విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాంబశివరావు మరణించాడు.

కాగా కుటుంబంలో నెలకొన్న సమస్యల కారణంగా కన్న కొడుకు, తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టడానికి అంగీకరించలేదు. దీంతో మృతుడి కుమార్తె శ్రీలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించింది. బంధువులు వెంటరాగా తన తండ్రికి అంతిమ సంస్కారాలు పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కుమారుడి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే తండ్రికి తలకొరివి పెట్టిన కూతురిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకే కంటే కూతుర్నే కనాలనేది అంటూ శ్రీలక్ష్మిని కొనియాడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..