ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కర్ఫ్యూ దృష్ట్యా పనివేళల్లో మార్పు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్‌డౌన్ పెట్టి కఠిన నిబంధనలను అమలు చేస్తున్న జగన్ సర్కార్.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కర్ఫ్యూ దృష్ట్యా పనివేళల్లో మార్పు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్
Cm Ys Jagan
Follow us
Balaraju Goud

|

Updated on: May 07, 2021 | 5:39 PM

AP Employees Working Hours: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్‌డౌన్ పెట్టి కఠిన నిబంధనలను అమలు చేస్తున్న జగన్ సర్కార్.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ కట్టడే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రోజున ఉత్తర్వులను జారీ చేసింది.

కర్ఫ్యూ నేపథ్యంలో ఉద్యోగుల పనివేళలు ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ఉండాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని హెచ్‌డీవో కార్యాలయాలు, సెక్రటెరియట్‌, జిల్లా కార్యాలయాలు, సబ్‌ డివిజన్‌ కార్యాలయాల్లో ఈ మేరకు అమలులోకి రానుంది. మధ్యాహ్నం 12 గంటల తరువాత ఉండాలంటే ఉద్యోగులకు కచ్ఛితంగా పాసులు కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. కాగా, అత్యవసర సర్వీసులకు ఏపీ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.

గత కొన్ని రోజులుగా ఏపీలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కొత్త రకం వైరస్ వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన నెలకొంది. ఇప్పుడున్న అన్ని వేరియెంట్ల కంటే ఇది 15 రెట్లు ప్రమాదకరమని సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజంలేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ వేరియెంట్ విషయంలో ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇది మరీ అంత ప్రమాదకరమేమీ కాదని సీసీఎంబీ కూడా తేల్చి చెప్పింది. ఈ వైరస్‌ను గత ఏడాది జూన్‌-జూలైలోనే గుర్తించారని.. అది కొత్తగా పుట్టుకొచ్చింది కాదని కోవిడ్‌ నిరోధక కమాండ్‌ కంట్రోల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన పాజిటివ్‌ కేసుల సంఖ్య చాలా తక్కువగానే ఉన్నట్లు వెల్లడించారు.

Read Also… Criminal Case on Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై నాన్ బెయిల్ కేసు.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కర్నూలు పోలీసులు

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!