Criminal Case on Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై నాన్ బెయిల్ కేసు.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కర్నూలు పోలీసులు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ న్యాయవాది సుబ్బయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు.
Criminal Case Against TDP Chief Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ న్యాయవాది సుబ్బయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కర్నూలు జిల్లా పోలీసులు తెలిపారు. కరోనా వైరస్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారం వల్లే కర్నూలులో సామాన్య జనం భయాందోళనకు గురవుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో కర్నూలులో ఎన్-440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ వాసులు ఆందోళన చెందుతున్నారని సుబ్బయ్య ఆరోపించారు.
కర్నూలుకు చెందిన న్యాయవాది సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చంద్రబాబు నాయుడిపై Cr.No.80/2021 ప్రకారం.. ఐపీసీ 155, 505(1)(బి)(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చంద్రబాబుపై 2005 ప్రకృతి వైఫరిత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద నాన్‌బెయిల్ కేసు నమోదు చేశామని కర్నూలు పోలీసులు తెలిపారు.