AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM Jagan: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఏపి సీఎం..

సత్య కుమార్ మరణించడంతో అతని కుటుంబానికి అండగా నిలవాలని భావించిన డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో  తక్షణమే స్పందించిన సీఎం జగన్.. విధి నిర్వహణలో మృతి చెందిన కానిస్టేబుల్ సత్య కుమార్ కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. అంతే కాదు ప్రభుత్వం తరపున 30 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ఎక్స్‌గ్రేషియా ను ప్రకటించారు. 

AP CM Jagan: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఏపి సీఎం..
Cm Jagan
P Kranthi Prasanna
| Edited By: Surya Kala|

Updated on: Dec 16, 2023 | 2:12 PM

Share

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ సత్య కుమార్ కుటుంబానికి ఏపి ప్రభుత్వం అండగా నిలిచింది. 30 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఉదరతను చాటింది. విధి నిర్వహణలో భాగంగా కడప – చెన్నై జాతీయ రహదారి పైన కడప నుండి భాకారపేట వద్ద ఉన్న బెట్టాలియన్ కు APSP కు చెందిన కానిస్టేబుల్ సత్య కుమార్ బైక్ పై వస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టు విరిగి పడడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ దుర్ఘటన భకరాపేట సమీపంలోని మలినేని పట్నం దగ్గర జరిగింది. 2005 బ్యాచ్ కు చెందిన సత్య కుమార్ సొంత ఊరు చెన్నూర్ మండలం.

అకస్మాత్తుగా సత్య కుమార్ మరణించడంతో అతని కుటుంబానికి అండగా నిలవాలని భావించిన డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో  తక్షణమే స్పందించిన సీఎం జగన్.. విధి నిర్వహణలో మృతి చెందిన కానిస్టేబుల్ సత్య కుమార్ కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. అంతేకాదు ప్రభుత్వం తరపున 30 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ఎక్స్‌గ్రేషియా ను ప్రకటించారు.

ఈ రోజు సత్య కుమార్ భార్య రాజీ, కుమారుడు సంతోష్ కుమార్ కి సీఎం జగన్ 30,00,000 లక్షల రూపాయల చెక్ ను అందజేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న సత్య కుమార్ కొడుకు డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం కల్పించే విధంగా G.O జారీ చేయాలని తన కార్యాలయ అధికారులకి ఆదేశాలను జారీ  చేశారు సీఎం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని.. ఈ చర్యల ద్వారా పోలీసులకు భరోసా లభిస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..