AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP 10th Class Results 2023: విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. రిజల్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి..

AP SSC Results 2023: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

AP 10th Class Results 2023: విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. రిజల్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి..
Ap 10th Results 2023
Shaik Madar Saheb
|

Updated on: May 06, 2023 | 11:34 AM

Share

AP SSC Results 2023: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫలితాలను విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. దీంతోపాటు టీవీ9 వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. పదోతరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు జరిగిన విషయం తెలిసిందే. 18 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈఏపీ) ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది పరీక్షలకు హాజరయ్యారు. హాజరైన వారిలో బాలురు 3,09,245, బాలికలు 2,95,807 మంది ఉన్నారు. విజయవాడలోని ఎస్‌ఎస్‌సీ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ఫలితాలను విడుదల చేసి.. ఉత్తీర్ణులయిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

ఈ ఏడాది కూడా బాలికలు.. బాలురపై పై చేయి సాధించారు. అత్యధిక శాతం మంది స్టూడెంట్స్ ఉత్తీర్ణులయ్యారు. 87.4 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం జిల్లా పథమ స్థానంలో నిలవగా.. నంద్యాల చివరిస్థానంలో ఉందిన. జూన్ 2 నుంచి 10 వరకు సప్లీమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

విద్యార్థులు తమ వ్యక్తిగత ఫలితాలను అధికారిక వెబ్ సైట్లు bse.ap.gov.in , www.results.bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు..  దీంతోపాటు టీవీ9 వెబ్ సైట్‌ లో కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.

AP SSC ఫలితాలను ఇలా చూసుకోండి..

    • bse.ap.gov.inలో BSEAP అధికారిక సైట్‌ని సందర్శించండి.
    • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న AP 10వ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
    • లాగిన్ వివరాలను నమోదు చేసి, ఎంటర్ క్లిక్ చేయండి.
    • పూర్తయిన తర్వాత మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
    • ఆ తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసుకోండి..

మరిన్ని ఏపీ వార్తల కోసం..