AP Weather: ఈరోజు, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో వర్షాలు

ఏపీలో నవంబర్ 9 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి 48 గంటలలో పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు తీరం వైపుకు ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది

AP Weather: ఈరోజు, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో వర్షాలు
Ap Rains
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 06, 2021 | 3:51 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతం దగ్గరలోని దక్షిణ ఆంధ్ర కోస్తా ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళఖాతం, దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళఖాతం దగ్గరలోని దక్షిణ ఆంధ్ర -ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతం మీద ఉన్నది. ఇది సగటు సముద్ర మట్టమునకు 4 .5 కిలోమీటర్ల  ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది.  ఆగ్నేయ బంగాళా ఖాతం, దాని దగ్గర ఉన్న భూమధ్య రేఖ వద్ద ఉన్న హిందూ మహా సముద్రము -సుమత్రా తీర ప్రాంతాల మీద ఉన్నఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టమునకు 3 .1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళా ఖాతం, దాని దగ్గర ఉన్న ప్రాంతాల మీద సుమారు నవంబర్ 9వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి రాగల 48 గంటలలో పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు తీరం వైపుకు ప్రయాణించే అవకాశం ఉంది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : ————————————————— ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ప్రధానంగా వాతావరణం పొడిగా ఉంటుంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర : —————————— ఈరోజు, రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ———————- ‌ ‌ఈరోజు, ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.

Also Read:  ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ అరెస్ట్.. అతి చేస్తే ఇంతే.. పూర్తి వివరాలు

చిరు అంటే సీన్ ఇలా ఉంటది.. ఐదుగురు టాప్ డైరక్టర్ల సమక్షంలో మెగాస్టార్ 154వ మూవీ లాంచ్