AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fun Bucket Bhargav : ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ అరెస్ట్.. అతి చేస్తే ఇంతే.. పూర్తి వివరాలు

సోషల్ మీడియా.. ఇప్పుడిదో ప్లాట్ ఫామ్. ఎక్కడో ఉన్న వాడిని ఇంకెక్కడితో తీసుకెళ్తుంది. ఏమేమో చేపిస్తది. కొంచెం టాలెంట్ ఉంటే చాలు.. ఇట్టే ఫేమస్ అయిపోవచ్చు.

Fun Bucket Bhargav : ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ అరెస్ట్.. అతి చేస్తే ఇంతే.. పూర్తి వివరాలు
Fun Bucket Bhargav
Ram Naramaneni
|

Updated on: Nov 06, 2021 | 3:36 PM

Share

సోషల్ మీడియా.. ఇప్పుడిదో ప్లాట్ ఫామ్. ఎక్కడో ఉన్న వాడిని ఇంకెక్కడితో తీసుకెళ్తుంది. ఏమేమో చేపిస్తది. కొంచెం టాలెంట్ ఉంటే చాలు.. ఇట్టే ఫేమస్ అయిపోవచ్చు. కానీ అదే సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని కొందరు ఆవారా గాళ్లు.. వెకిలి వేషాలు వేస్తారు. ఇంత పేరు రాగానే.. అహంకారం తలకెక్కుతుంది. చిల్లర పనులు చేసి చెంప చెల్లుమని కొట్టాలనిపించే పనులు చేస్తారు. ఫన్ బకెట్ భార్గవ్.. షార్ట్ వీడియోలు చేస్తూ షార్ట్ టైమ్‌లోనే ఫేమస్ అయ్యాడు. వినోదాన్ని పంచుతూ.. ఫాలోవర్స్‌ను కూడా పెంచుకున్నాడు. కానీ ఇదంతా.. కెమెరా ముందు మాత్రమే. కెమెరా వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. అతగాడి స్క్రీన్ ప్లే ఒక్కొక్కటిగా రివీల్ అవుతోంది.

అవే చేష్టలు.. అవే జులాయి మాటలు.. అవే పోకిరీ చేష్టలు..సోషల్‌ మీడియాలో ఆవారాగాడు..వికృత చేష్టలుచేసి జైలుకెళ్లాడు.. బయటకు వచ్చినా బుద్ధి మారలేదు. తీరు మార్చుకోలేదు. ఫలితంగా మళ్లీ కటకటాలపాలయ్యాడు టిక్‌టాక్‌ స్టార్‌ అని చెప్పుకును కంత్రీ .. ఫన్‌ బకెట్‌ భార్గవ్‌. భార్గవ్‌కు మరోసారి రిమాండ్‌ విధించింది పోక్సో కోర్టు. అవకాశం ఇప్పిస్తానని చెప్పి మాయమాటలతో బాలికను లోబర్చుకున్న భార్గవ్ ఏప్రిల్‌ 18న అరెస్టయ్యాడు. పెందుర్తి పీఎస్‌ కేసులో భార్గవ్‌పై కేసు నమోదైంది. జూన్ 15న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.

బెయిల్‌పై బయటకు వచ్చాక కూడా భార్గవ్‌ తీరు మారలేదు. మళ్లీ యథావిధిగా చిల్లర వ్యవహారాలకు పాల్పడడం మొదలుపెట్టాడు‌. బెయిల్ రూల్స్‌ని ఉల్లంఘించాడు. ఈ నేపథ్యంలో భార్గవ్‌పై మెమో ఫైల్ చేశారు డీఎస్సీ ప్రేమ్ కాజల్. కేసు విచారణలో ఉండగా.. సాక్షులను బెదిరించడం, ప్రభావితం చేసేలా ప్రకటనలు చేసినట్టు మెమోలో పొందుపర్చారు పోలీసులు. దీంతో బెయిల్ రద్దు చేసిన పోక్సో కోర్టు.. ఈనెల 11 వరకూ రిమాండ్ విధించింది. ఫన్ బకెట్ భార్గవ్‌ను సెంట్రల్ జైలుకు తరలించారు.

ఆరోపణలు వచ్చాయ్.. కోర్టులో కేసు నడుస్తోంది. రెండు నెలలు ఊచలు లెక్కపెట్టాడు. బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇకనైనా పద్ధతిగా ఉండాలి కదా.. అలా ఉంటే ఇప్పుడు మళ్లీ ఎందుకు జైలుకు వెళ్తారు.. ఏదో ఒక యాక్షన్ చేస్తేనే కదా.. రియాక్షన్ వచ్చేది.  ఫన్ బకెట్ భార్గవ్  విషయంలోనూ అదే జరిగింది. ఈయన గారికి ఎవరో బ్యాడ్ కామెంట్ పెట్టాడట. అతడికి తెలియాలని.. కొన్ని నీతి వాఖ్యాలు చెప్పాడు. సోషల్ మీడియా అన్నాక కామెంట్లు.. వస్తూనే ఉంటాయ్.. వాటికి అంత ఇబ్బందిగా ఫీల్ అయితే.. కామెంట్స్ ఆఫ్ చేయాలి. లేదంటే పట్టించుకోకుండా.. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళ్లిపోవాలి. కానీ ఫన్ బకెట్ బార్గవ్ మాత్రం తిట్టిపడేశాడు.

అంతే కాదు ఓ సోషల్ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంచెం ఘాటు పదాలే ఉపయోగించాడు. తనపై ఉన్న కేసు గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియోల ఆధారంగా.. బెయిల్ రద్దు చేయాలని కోర్టులో మెమో ఫైల్ చేశారు దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్. ఇంకేముంది బకెట్ తిరబడింది. అబ్బాయ్ మళ్లీ ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.

Also Read: ఫస్ట్ క్లాస్ ఆలుగడ్డలు అనుకోకండి.. అసలు యవ్వారం వేరే ఉంది.. పక్కా స్కెచ్