Odd Tradition: కాలితో తన్నించుకుంటే కష్టాలు హాం ఫట్.. కర్నూలు జిల్లాలో వింత ఆచారం..
సాధారణంగా మనకున్న ఇబ్బందులు, కష్టాలు తీరిపోవాలని పూజలు, ఉపవాసాలు చేస్తాం. మరికొంతమంది దేవాలయాలకు వెళ్లి తలనీలాలు, ఇతర బహుమతులు సమర్పిస్తాం.

సాధారణంగా మనకున్న ఇబ్బందులు, కష్టాలు తీరిపోవాలని పూజలు, ఉపవాసాలు చేస్తాం. మరికొంతమంది దేవాలయాలకు వెళ్లి తలనీలాలు, ఇతర బహుమతులు సమర్పిస్తాం. అయితే కర్నూలు జిల్లాలోని ఓగ్రామంలోని ప్రజలు తమ కష్టాలు తీరిపోవాలని ఏకంగా కాలితో తన్నించుకుంటారు. ఇందుకోసం నేలపై బొక్కబోర్లా పడుకుని మరీ బారులు తీరుతారు. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామంలో ఏటా దీపావళి మరుసటి రోజున ఈ వింత ఆచారం జరుగుతుంది.
వేడుకల్లో భాగంగా గ్రామంలో కొలువై ఉన్న హుల్తీ లింగేశ్వర స్వామిని ఘనంగా ఊరేగిస్తారు. ఇదే సమయంలో భక్తులు నేలపై బొక్కా బొర్లా పడుకుంటారు. స్వామివారిని మోసేవారు వీరి తలను కాలితో తన్నుకుంటూ ముందుకు సాగుతారు. ఇలా కాలితో తన్నించుకోవడానికి స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బారులు తీరడం విశేషం. ఇలా కాలితో తన్నించుకుంటే స్వామివారు తమ కోరికలు మన్నించి కష్టాలు తీరుస్తాడని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇక ఇదే గ్రామానికి పక్కనున్న హోసూరు గ్రామంలో గాడిదలకు పెళ్లిచేస్తే విరివిగా వర్షాలు కురుస్తాయన్న ఆచారం ఉంది.
Also Read:
