Crime News: శ్రీకాకుళం జిల్లాలో మరో దారుణం.. 12 ఏళ్ల బాలికపై సచివాలయంలో గ్రామ వాలంటీర్ల అఘాయిత్యం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో అభయం శుభం తెలియని బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు దుర్మార్గులు.

Crime News: శ్రీకాకుళం జిల్లాలో మరో దారుణం.. 12 ఏళ్ల బాలికపై సచివాలయంలో గ్రామ వాలంటీర్ల అఘాయిత్యం!
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 06, 2021 | 11:27 AM

Srikakulam Girl Gang Rape: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా అమ్మాయిలకు రక్షణ లేకుండాపోతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో అభయం శుభం తెలియని బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు దుర్మార్గులు. గ్రామ సచివాలయం సాక్షిగా వాలంటీర్లే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

జిల్లాలోని వీరఘట్టం మండలం నుడుకూరులో గత నెల 31న బాలికపై అత్యాచారం జరిగింది. గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తున్న బొత్స హరిప్రసాద్‌, గుగ్గిలాపు రాంబాబుతో పాటు మరొకరు 12ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించారు. తల్లిదండ్రులు ఊళ్లో లేరని తెలుసుకుని ఆమెకు మాయమాటలు చెప్పి సచివాలయంలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత సామూహికంగా అత్యాచారం చేశారు. అనంతరం అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కుటుంబసభ్యులు వచ్చేసరికి అనారోగ్యానికి గురైన బాలకను నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఆదివారం రోజున సచివాలయం మూసివేయాలి. కానీ వాలంటీర్లు సెలవు రోజున కూడా ఓపెన్ చేసి ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని గ్రామస్తులు ఆరోపించారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, బాధితురాలిని స్థానిక నేతలు పరామర్శించారు. మరోవైపు వాలంటీర్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లు వెల్లడించారు.

Read Also…  Viral Video: చిన్ననాటి ఆ సంతోషాలు ఎప్పటికీ మర్చిపోలేనివి.. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!