Viral Video: చిన్ననాటి ఆ సంతోషాలు ఎప్పటికీ మర్చిపోలేనివి.. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ కాలంలో మనిషితో మనిషి మాట్లాడుకునే సమయం కూడా తీసుకోవడం లేదు. మారుతున్న జీవనశైలి...

Viral Video:  చిన్ననాటి ఆ సంతోషాలు ఎప్పటికీ మర్చిపోలేనివి.. ఈ వీడియో  చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు..
Treanding Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 06, 2021 | 11:17 AM

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ కాలంలో మనిషితో మనిషి మాట్లాడుకునే సమయం కూడా తీసుకోవడం లేదు. మారుతున్న జీవనశైలి… ఉరుకుల పరుగుల జీవితం.. పనిభారంతో.. ఉద్యోగసమయాల్లో మార్పులు…కాస్త విరామం దొరికిన అరచేతిలోనే ప్రపంచాన్ని చూసేయ్యడం.. ఇప్పుడిదే జీవన విధానంగా మారిపోయింది. కానీ స్మార్ట్ ఫోన్ లేని సమయంలో చిన్ననాటి రోజులలో ఎంతో సమయాన్ని ఆటల కోసం తీసుకునేవారు. మట్టిలో ఆటలు మరీ ఎక్కువే. వర్షపు నీటిలో ఆడుకోవడం అంటే పిల్లలకు మరింత సరదా.. ఎత్తైన ప్రదేశం నుంచి బురదలో జారుతూ ఆడుకోవడం..వింటుంటే.. మీ చిన్ననాటి రోజులు జ్ఞాపకం గుర్తుకువస్తుంది. నిజమే.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీ చిన్ననాటి రోజులు.. మీరు ఆడిన ఆటలు గుర్తుకురావడం పక్కా.. ఎందుకో తెలుసుకుందామా..

గత కొద్ది రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో కొందరు చిన్నారులు బురదలో జారుడు ఆట ఆడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వర్షం కురిసిన అనంతరం.. ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి వెళ్లేందుకు ఉన్న దారిని వారి జారడం కోసం ఉపయోగించేసుకున్నారు. పై నుంచి బురదలో జారుతూ తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తమ చిన్ననాటి రోజులు గుర్తుకువస్తున్నాయని కామెంట్స్ చేయగా.. మరికొందరు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

Also Read: ఈ చిన్నారికి ఇప్పుడు దేశమంత అభిమానులే.. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో వరకు ప్రయాణం అనితరం..

Lijomol Jose: ఆ సినిమా మొత్తం ఏడుస్తూనే చేశాను.. డైరెక్టర్ కట్ చెప్పినా కన్నీళ్లు ఆగలేదు..జైభీమ్ సినతల్లి..

Tanya Ravichandran: అమ్మానాన్నలతో గొడవపడి మరీ దానికి ఒప్పించా.. ఆసక్తికర విషయాలు తెలిపిన అందాల తార తాన్యా రవి..