Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lijomol Jose: ఆ సినిమా మొత్తం ఏడుస్తూనే చేశాను.. డైరెక్టర్ కట్ చెప్పినా కన్నీళ్లు ఆగలేదు..జైభీమ్ సినతల్లి..

తమిళ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అవుతుంది.

Lijomol Jose: ఆ సినిమా మొత్తం ఏడుస్తూనే చేశాను.. డైరెక్టర్ కట్ చెప్పినా కన్నీళ్లు ఆగలేదు..జైభీమ్ సినతల్లి..
Lijomole Jose
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 06, 2021 | 10:07 AM

తమిళ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలైన మొదటి రోజ నుంచి ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా.. సూర్య సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. గిరిజన వర్గాలపై పోలీసులు ఎలా కేసులు పెడతారు.. వారిని ఎలా శిక్షిస్తారు.. నేరం ఒప్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న అంశాలను ఈ సినిమాలో చూపించారు. 1993లో తమిళనాడులో గిరిజన యువతి కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇదే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో చంద్రు పాత్రలో హీరో సూర్య నటించగా.. సినతల్లి పాత్రలో మలయాళి నటి లిజోమోల్ నటించింది.

ఈ సినిమాలో సూర్య నటకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సూర్యతోపాటు అదే రెంజ్‏లో సినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ జోస్‏ను కూడా సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. క గర్భవతిగా.. భర్తకు దూరమైన భార్యగా తనకు జరిగిన అన్యాయం పై పోరాటం చేసే మహిళగా పూర్తి డీగ్లామర్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది లిజోమోల్. తాజాగా జైభీమ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది లిజోమోల్. సినిమా షూటింగ్ చేస్తున్నంతసేపు గ్లిజరిన్ అవసరం లేకుండానే ఏడ్చేసేదంట. సినిమా ప్రభావం తనపై ఎక్కువగానే చూపించిందని చెప్పుకొచ్చింది. ఇప్పటికి వరకు తను చేసిన పాత్రలలన్నింటికంటే సినతల్లి పాత్ర ప్రత్యేకమని తెలిపింది.

సినతల్లి భర్త రాజన్న మరణానికి సంబంధించిన సీన్స్, పోలీసులు చిత్రహింసలు పెట్టే సీన్స్ చేసేటప్పుడు అస్సలు గ్లిజరిన్ ఉపయోగించలేదని చెప్పుకొచ్చింది. ఈ సీన్లు చేస్తున్నంతసేపు కాళ్లలో నీళ్లు వచ్చేవని తెలిపింది. డైరెక్టర్ కట్ చెప్పినా కన్నీళ్లు ఆగేవి కాదని తెలిపింది.

ఇక లిజోమోల్ కేరళ అమ్మాయి. ఫహద్ ఫాజిల్ నటించిన మహేశించే ప్రతికారం సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘రిత్విక్ రోషన్’ ‘హనీ బీ 2.5’ ‘స్ట్రీట్ లైట్స్’ ‘ప్రేమసూత్రం’ ‘వత్తకోరు కాన్ముకన్’ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఓరేయ్ బామ్మర్ధి సినిమాలో సిద్దార్థ్‏కు జోడిగా నటించింది.

Also Read: Samantha: నిర్మాతలకు చుక్కలు చూపిస్తోన్న సమంత .. ఒక్క సినిమాకు సామ్‌ ఎంత డిమాండ్‌ చేస్తుందో

తెలుసా.?

Tanya Ravichandran: అమ్మానాన్నలతో గొడవపడి మరీ దానికి ఒప్పించా.. ఆసక్తికర విషయాలు తెలిపిన అందాల తార తాన్యా రవి..

Balakrishna: బాలయ్యతో జతకట్టనున్న శృతీ.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్‌.. ఆసక్తిని రేకెత్తిస్తోన్న టైటిల్‌.