AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: నిర్మాతలకు చుక్కలు చూపిస్తోన్న సమంత .. ఒక్క సినిమాకు సామ్‌ ఎంత డిమాండ్‌ చేస్తుందో తెలుసా.?

Samantha: నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నటి వరకు వ్యక్తిగత జీవితం కారణంగా సామ్‌ టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. విడాకుల అనంతరం..

Samantha: నిర్మాతలకు చుక్కలు చూపిస్తోన్న సమంత .. ఒక్క సినిమాకు సామ్‌ ఎంత డిమాండ్‌ చేస్తుందో తెలుసా.?
Samantha
Narender Vaitla
|

Updated on: Nov 06, 2021 | 10:05 AM

Share

Samantha: నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నటి వరకు వ్యక్తిగత జీవితం కారణంగా సామ్‌ టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. విడాకుల అనంతరం లైఫ్‌ను మరింత బీజీగా మార్చుకునేందుకు సమంత పక్కా ప్లాన్‌ వేసుకుంది. ఇందులో భాగంగానే గతకొన్ని రోజుల క్రితం స్నేహితులతో కలిసి తీర్థ యాత్రలతో పాటు విదేశీలకు కూడా వెళ్లింది. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న శాకుంతలం సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న సామ్‌ తన తర్వాతి చిత్రాలను ప్రారంభించేకంటే ముందు కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని భావించినట్లు సమాచారం. అందుకే కొన్ని రోజులు అలా జాలీగా గడిపి మళ్లీ షూటింగ్‌లో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సినిమాల్లో వేగాన్ని పెంచాలని భావిస్తోన్న సమంత వరుస చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తోంది. ఇప్పటికే ఈ సమంత తెలుగు, తమిళంలో చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువైన సమంత అక్కడ కూడా అవకాశాలు దక్కించుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కేవలం సినిమాలే కాకుండా వెబ్‌ సిరీస్‌లోనూ నటించేందుకు సామ్‌ మొగ్గు చూపుతోందని టాక్‌. అయితే ఇప్పుడు సమంత రెమ్యునరేషన్‌ విషయంతో మరో సారి వారల్లో నిలిచింది. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనతో ఉన్న సమంత భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసినట్లు తెలుస్తోంది.

సమంత కొత్త సినిమాల కోసం ఏకంగా రూ. 3 కోట్లు డిమాండ్‌ చేస్తుందనేది సదరు వార్త సారంశం. అయితే సమంత ఈ డిమాండ్ పాన్‌ ఇండియా చిత్రాలకు చేస్తుందా.? లేదా కేవలం బాలీవుడ్‌ చిత్రాలకేనా అనేది తెలియాల్సి ఉంది. ఇక నటి తమన్నా కూడా తన రెమ్యునరేషన్‌ను రూ. 3 కోట్లకు పెంచినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఉత్తరాది నటీమణులే కాకుండా దక్షిణాది బ్యూటీలు కూడా రెమ్యునరేషన్‌ విషయంలో పోటీ పడుతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Cooking Oil: మీరు వాడే వంట నూనెల్లో ఏది ఉత్తమం.! ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి..

Vastu Tips: లాఫింగ్ బుద్ధాను ఇంట్లో పెడితే ఏం జరుగుతుందో తెలుసా…ఆసక్తికర విషయాలు మీకోసం..

Tanya Ravichandran: అమ్మానాన్నలతో గొడవపడి మరీ దానికి ఒప్పించా.. ఆసక్తికర విషయాలు తెలిపిన అందాల తార తాన్యా రవి..