Balakrishna: బాలయ్యతో జతకట్టనున్న శృతీ.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్‌.. ఆసక్తిని రేకెత్తిస్తోన్న టైటిల్‌.

Balakrishna: 2019లో వచ్చిన 'రూలర్‌' సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు నట సింహం బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'అఖండ' చిత్రం కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. నిజానికి..

Balakrishna: బాలయ్యతో జతకట్టనున్న శృతీ.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్‌.. ఆసక్తిని రేకెత్తిస్తోన్న టైటిల్‌.
Balakrishna Shruthi Hasan
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 06, 2021 | 7:24 AM

Balakrishna: 2019లో వచ్చిన ‘రూలర్‌’ సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు నట సింహం బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘అఖండ’ చిత్రం కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా షూటింగ్‌ జరగకపోవడంతో వాయిదా పడింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. శరవేగంగా షూటింగ్‌ పూర్తిచేసుకునే పనిలో ఉన్న సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే రూలర్‌ తర్వాత వచ్చిన గ్యాప్‌ను ఫిల్‌ చేసేందుకు బాలకృష్ణ ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘అఖండ’ ఇంకా విడుదల కాకముందే మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గోపీచంద్‌ మలినేనేని దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. ఎన్బీకే 107 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రారంభంకానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శృతీ హాసన్‌ నటించనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా చిత్ర యూనిట్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు చిత్ర దర్శకుడు గోపీచంద్‌ శృతిని సినిమాలోకి ఆహ్వానిస్తూ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే గోపీచంద్‌ దర్శకత్వంలో శృతీ నటిస్తుండడం ఇది మూడోసారి కావడం విశేషం.

గతంలో ఎన్నడూ కనిపించని విధంగా బాలకృష్ణ ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకు భారీగానే ఖర్చు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చిత్ర యూనిట్‌ ‘జై బాలయ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: RRR Movie: ఇంట్రెస్టింగ్ పోస్టర్‏తో అప్డేట్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీం.. స్టెప్పులతో అదరగొడుతున్న తారక్.. చరణ్ ..

Indian Oil: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీతో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..!

Blackmail: న్యూడ్‌ కాల్స్‌తో బ్లాక్‌ మెయిల్‌… పెరుగుతున్న కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..