Bigg Boss 5 Telugu: ప్రియాంక పరువుతీసిన మానస్.. కంటెంట్ కోసం చేస్తున్నావంటూ..

బిగ్‏బాస్ 62 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. బుల్లితెరపై విజయవంతంగా దూసుకుపోతున్న ఈ షో

Bigg Boss 5 Telugu: ప్రియాంక పరువుతీసిన మానస్.. కంటెంట్ కోసం చేస్తున్నావంటూ..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 06, 2021 | 7:21 AM

బిగ్‏బాస్ 62 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. బుల్లితెరపై విజయవంతంగా దూసుకుపోతున్న ఈ షో… లవ్ ట్రాక్స్ అడ్డగా మారిపోయింది. కంటెస్టెంట్స్ మధ్య లవ్ ట్రాక్స్ నడిపిస్తూ.. తనకు కావాల్సినట్టుగా ప్రోమోస్.. ఎపిసోడ్స్ కట్ చేసుకోని మరీ ప్లే చేయడం బిగ్‏బాస్ సరదా. ఇక హౌస్‏లో ఉండాలంటే.. లవ్ ట్రాక్స్ నడపాలి.. లేదంటే అందరితో గొవడలు పెట్టుకోవాలి. ఇదే గత సీజన్స్ నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఇక ఈసారి బిగ్‏బాస్ షోలో లవ్ ట్రాక్స్ అంతగా ఉండకపోయిన గొడవలతో రచ్చ చేస్తున్నారు హౌస్ మేట్స్. ఇక నిన్నటి ఎపిసోడ్‏లు సిత్రాలు కూడా బాగానే జరిగాయి.

ఇక కెప్టెన్సీ టాస్కులో భాగంగా.. సూపర్ హీరోస్.. సూపర్ విలన్స్ మధ్య హోరాహోరీ పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. బిగ్‏బాస్ ఇచ్చిన టాస్కులను విజయవంతగా పూర్తిచేసి సూపర్ విలన్స్ టీం విజేతగా నిలిచింది. దీంతో విలన్స్ టీం సంతోషంగా గంతులేశారు. ఇక జెస్సీ కూడా విలన్స్ టీం కావడంతో అతడికి వెనక నుంచి హగ్ ఇచ్చింది ప్రియాంక. అయితే కంగ్రాట్స్ చెప్పడానికి హగ్ ఇచ్చిన ప్రియాంకకు ముద్దు పెట్టి షాకిచ్చాడు జెస్సీ… ఈ తతంగాన్ని మొత్తం చూసిన శ్రీరామ్ పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. ఇక ఇదే విషయంపై షణ్ముఖ్, శ్రీరామ్ ముచ్చట్లు పెట్టుకున్నారు.

మానస్ ఎక్కడా ఉన్నా వెతికి మరీ సపర్యలు చేసే పింకీ… నిన్నటి ఎపిసోడ్‏లో కూడా అతడిని వెతికే పనిలో పడింది.. మానస్ కూర్చుని తింటుండగా.. అతని దగ్గరకు వచ్చి మెలికలు తిరిగింది. ఏంటీ కంటెంట్ కోసం ట్రై చేస్తున్నట్టు ఉన్నావ్ అని మానస్ పరువు తీశాడు. నువ్వు అంటుంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను అని ప్రియాంక అనగానే.. ఎందుకు అంత సీన్ చేస్తున్నావ్.. తినాలా వెళ్లిపోవాలా ? ఇక్కడ నుంచి అంటూ సీరియస్ అయ్యాడు మానస్. ఆ తర్వాత.. సిరి, ప్రియాంక మధ్య మానస్ గురించి చర్చ జరిగింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారంట కదా అని సిరి అడగ్గా.. ప్రియాంక తెగ సిగ్గుపడిపోయింది. నేనంటే ఇష్టం.. కానీ ఓపెన్ కావడం లేదంటూ చెప్పుకుంది ప్రియాంక.

Also Read: Tamara Movie: అంతర్జాతీయ చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‏టైన్మెంట్స్.. డైరెక్టర్ ఎవరంటే…

RRR Movie: ఇంట్రెస్టింగ్ పోస్టర్‏తో అప్డేట్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీం.. స్టెప్పులతో అదరగొడుతున్న తారక్.. చరణ్ ..

Aevum Jagat Teaser: ‘ఇది కలాం కలలు కన్న దేశం కాదు.. బాపు సాధించిన స్వతంత్రం కాదు’.. ఆసక్తికరంగా ఏవం జగత్‌ టీజర్‌.