AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamara Movie: అంతర్జాతీయ చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‏టైన్మెంట్స్.. డైరెక్టర్ ఎవరంటే….

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కిస్తూ టాప్ ప్రొడక్షన్ బ్యానర్‏గా నిలుస్తుంది సితార ఎంటర్‏టైన్మెంట్స్.

Tamara Movie: అంతర్జాతీయ చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‏టైన్మెంట్స్.. డైరెక్టర్ ఎవరంటే....
Tamara
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2021 | 7:00 AM

Share

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కిస్తూ టాప్ ప్రొడక్షన్ బ్యానర్‏గా నిలుస్తుంది సితార ఎంటర్‏టైన్మెంట్స్. తాజాగా ఈ నిర్మాణ సంస్థ మరో ముందుడుగేసింది. ఓ అంతర్జాతీయ సినిమాను నిర్మించబోతున్నట్లుగా ప్రకటించింది. భారత్ ఫ్రెంచ్ భాగస్వామ్యంతో ఈ సినిమా తెరకెక్కనుందని సితార సంస్థ వెల్లడించింది. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ విడుదల చేశారు మేకర్స్. అలాగే ఈ మూవీకి తామర అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

మరోవైపు..తన కెమెరాతో ఎంతోమంది స్టార్లను అందంగ చూపించి..ఎన్నో అద్భుత దృశ్యాలను వెండితెరపై ఆవిష్కరించి.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్. అలాగే.. పలు సినిమాలతో డైరెక్టర్‏గానూ సక్సెస్ అందుకున్నాడు. తాజాగా రవి కె. చంద్రన్ మరోసారి మెగాఫోన్ పట్టడానికి సిద్ధమయ్యాడు.. సితార ఎంటర్‏టైన్మెంట్స్ నిర్మిస్తోన్న తామర చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు రవి కె. చంద్రన్. ఈ విషయాన్ని సితార ఎంటర్‏టైన్మెంట్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. దీంతోపాటు..ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఇక తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే.. ఫీమేల్ ఒరియంటెడ్ సినిమాగా తెలుస్తోంది. ఈ అంతర్జాతీయ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్. మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటించిన భరత్ అనే నేను అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవి కె.చంద్రన్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాకు సినిమాట్రోగ్రాఫర్‏గా పనిచేస్తున్నారు. ఇందులో రానా కీలకపాత్రలో నటిస్తుండగా.. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తోంది.

Also Read: RRR Movie: ఇంట్రెస్టింగ్ పోస్టర్‏తో అప్డేట్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీం.. స్టెప్పులతో అదరగొడుతున్న తారక్.. చరణ్ ..

Rashi Khanna: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ముద్దమందారం… చూస్తే వావ్ అనాల్సిందే…

Upasana Konidela: మెగా ఫ్యామిలీలో దీపావళి సంబరాలు… ఫొటోస్ షేర్ చేసిన ఉపాసన..