Andhra Pradesh: వాళ్ల ఇంటికే పోయినోన్ని.. బెడ్ రూంలోకి పోలేనా.. ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..!

అనంతపురం టీడీపీ లీడర్స్ అయిన జేసీ బ్రదర్స్‌పై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు

Andhra Pradesh: వాళ్ల ఇంటికే పోయినోన్ని.. బెడ్ రూంలోకి పోలేనా.. ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..!
Kethireddy Peddareddy
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 28, 2023 | 4:04 PM

అనంతపురం టీడీపీ లీడర్స్ అయిన జేసీ బ్రదర్స్‌పై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు తన అన్నను చంపించారని, తాను కక్ష తీర్చుకోవాలంటే గంట సమయం కూడా పట్టదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వాళ్ల ఇంటికే వెళ్లిన వాడిని.. బెడ్‌ రూమ్‌లోకి పోలేనా? అని అన్నారు. అయితే, తనది అలాంటి సంస్కృతి కాదని చెప్పుకొచ్చారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర చేపట్టారు. అయితే, ఈ పాదయాత్రలో కొన్ని కరపత్రాలు కలకలం సృష్టించాయి. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏం చేశాడో చెప్పాలంటూ ఆ కరపత్రాల్లో డిమాండ్ చేశారు. అయితే, ఈ కరపత్రాలపై కేతిరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వీటిని జేసీ ప్రభాకర్ రెడ్డే పంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేసీ బ్రదర్స్‌పై సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి.

తాను పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేక గ్రామాల్లో ఫ్యాక్షన్ గొడవలు పెట్టడానికి ఇలా కరపత్రాలు పంచుతున్నాడని ఆరోపించారు ఎమ్మెల్యే. జేసీ ప్రభాకర్ రెడ్డికి దుమ్ముంటే.. 30 సంవత్సరాలలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు పెద్దారెడ్డి. తాను 3 సంవత్సరాలలో ఏం చేశానో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని, అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాను డబ్బుల కోసం ఎవరికీ పదవులు ఇవ్వలేదన్నారు. ఫ్యాక్షన్ కల్చర్‌ను మళ్లీ తీసుకురావాలని చూస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు పెద్దారెడ్డి. తాను వాళ్ల ఇంటికి వెళ్లినవాడినని, జేసీ బెడ్‌ రూమ్‌లోకి వెళ్లలేని అని అన్నారు. తాను తలుచుకుంటే.. జేసీ బ్రదర్స్ తాడిపత్రి విడిచివెళ్లిపోతారని, ఆ పరిస్థితి తీసుకురావొద్దని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..