Andhra Pradesh: అలా చేస్తే రోడ్లపై కూడా తిరగలేరు.. రాజకీయ నేతలకు పోలీసుల వార్నింగ్..!
పోలీసులను దూషించిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కు తిరుపతి జిల్లా పోలీస్ అధికారుల సంఘం కౌంటర్ ఇచ్చింది. పోలీసులు తిడితే ఎవరూ హీరోలు..
పోలీసులను దూషించిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కు తిరుపతి జిల్లా పోలీస్ అధికారుల సంఘం కౌంటర్ ఇచ్చింది. పోలీసులు తిడితే ఎవరూ హీరోలు అయిపోరని అన్నారు తిరుపతి జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి. అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. కుప్పం పిఎస్ లో ఐపీసీ సెక్షన్ 153 కింద కేసు నమోదు చేశామన్నారు. పోలీసుల ఆత్మస్థైర్యం, మనోభావాలను అవమానించేలా అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయని వాపోయారు.
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమనీ, మైలేజ్ పెంచుకోవడానికి పోలీసుల పట్ల చులకన వ్యాఖ్యలు చేయడం రాజకీయ నేతలకు పరిపాటైందని ఆరోపించారు. రాజకీయాల కోసం పోలీసులను నోటి దురుసుగా ఇష్టానుసారం మాట్లాడితే స్వతంత్రంగా ప్రజల్లో తిరిగే రోజులు ఉండవని హెచ్చరించారు. పోలీసులు తలచుకుంటే రాజకీయ నేతలు స్వేచ్ఛగా రోడ్లమీద తిరగలేరని అన్నారు. పోలీసులను తిడితే హీరోలు అయిపోరనీ, రాజకీయ నాయకులు పోలీసుల పట్ల హుందాగా వ్యవహరించాలని సూచించారు. అచ్చెన్నాయుడు పోలీసులకు, మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు సోమశేఖర్ రెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..