AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రకృతి మహాద్భుతం.. చెట్టు వేరు నుంచి జలధార! కొండాకోనల్లో దాహం తీర్చుతోన్న వింత చెట్టు..

ప్రకృతి మానవాళికి ఒక వరం. చెట్లు, మొక్కలు, నీరు లేని భూమిని మనం ఊహించుకొలేము. భూమిపై మనిషి ఉన్నంత కాలం చెట్లు, పక్షులు ఉండాల్సిందే. చెట్లు ఇచ్చే ఆక్సిజన్ ను పీల్చుకొని మనం జీవనం సాగిస్తున్నాము. అయితే ప్రకృతిలో ఎన్నో వింతలు మనం చూస్తూ ఉంటాం. విభిన్నంగా ఉండే చెట్లు, రకరకాల మొక్కలు అప్పుడప్పుడు కనిపిస్తూ అద్భుతమనిపిస్తాయి. మనకు వాటిని చూడగానే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కళ్లు అప్పగించేస్తాము. శరీరం పులకరిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న..

Andhra Pradesh: ప్రకృతి మహాద్భుతం.. చెట్టు వేరు నుంచి జలధార! కొండాకోనల్లో దాహం తీర్చుతోన్న వింత చెట్టు..
Water Flows From Root Of Tree In Katkuru
B Ravi Kumar
| Edited By: |

Updated on: Nov 01, 2023 | 11:43 AM

Share

ఏలూరు, నవంబర్‌ 1: ప్రకృతి మానవాళికి ఒక వరం. చెట్లు, మొక్కలు, నీరు లేని భూమిని మనం ఊహించుకొలేము. భూమిపై మనిషి ఉన్నంత కాలం చెట్లు, పక్షులు ఉండాల్సిందే. చెట్లు ఇచ్చే ఆక్సిజన్ ను పీల్చుకొని మనం జీవనం సాగిస్తున్నాము. అయితే ప్రకృతిలో ఎన్నో వింతలు మనం చూస్తూ ఉంటాం. విభిన్నంగా ఉండే చెట్లు, రకరకాల మొక్కలు అప్పుడప్పుడు కనిపిస్తూ అద్భుతమనిపిస్తాయి. మనకు వాటిని చూడగానే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కళ్లు అప్పగించేస్తాము. శరీరం పులకరిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న చెట్టు కూడా ఆ కోవలోనిదే. ఎందుకంటే దాని ప్రత్యేకత తెలిస్తే సృష్టికి లోని నిగూఢమైన రహస్యాలు వెనుక ఉన్న మర్మం తెలుసుకోవాలనిపిస్తుంది.

సాధారణంగా చెట్లు స్వఛ్చమైన ఆక్సిజన్ ఇస్తాయని అందరికీ తెలుసు. కానీ స్వఛ్చమైన నీరు ఇస్తుందంటే అది అద్బుతం కాక ఇంకేమిటి. ఇదేదో మానవ సృష్టి, టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఇటువంటి వింతలు విశేషాలు మామూలే అని కొట్టిపారేస్తారెమో. అలా అనుకుంటే పొరపాటే. ఇది ఖచ్చితంగా ప్రకృతి వింత. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కట్కురు అనే గ్రామంలో ఒక చెట్టు వేరు నుంచి నిరంతరాయంగా నీరు వస్తుంది. చెట్టు వేరు నుంచి ధారగా నీరు రావడం ఎంటి అనే కదా అందరూ అనుకునేది. కానీ ఇక్కడ అటువంటి అద్భుతమే కనిపిస్తోంది. ఆంధ్రా కాశ్మీర్ లా ప్రకృతి అందాలతో ఆహ్లాదాన్ని పంచే ఏలూరు ఏజెన్సీలో అంతు చిక్కని ఈ రహస్యం దాగి ఉంది. ఇక్కడ ఉండే మహా శివుడి ఆలయం సమీపంలో ఈ చెట్టు ఉంది. ఏళ్ల క్రితం నుంచి ఈ వృక్షం క్రింద వేరు నుంచి ధారగా నీరు రావడం వింత అనుభూతి కలిగిస్తోంది. ఎక్కడ నుంచి నీరు వస్తుందో ఎవరికి అంతుబట్టడం లేదు.

ఇవి కూడా చదవండి

కాలంతో పని లేకుండా నిరంతరం ఈ చెట్టు వేరు నుంచి నీరు రావడం అటు పర్యాటకులను, ఇటు భక్తులను ఆకట్టుకుంటుంది. స్వచ్ఛమైన ఈ నీరు తాగితే రోగాలు మటుమాయం అవుతున్నయని భక్తుల నమ్మకం. మొదట్లో ఈ చెట్టు వేరు నుంచి వస్తున్న నీటిని చూసిన స్థానికులు కొండ కోనల్లో నుంచి నీరు వస్తుందనీ భావించారు. మండు వేసవిలో సైతం నీరు అలాగే రావడం చూసి ఆ నీరు ఎలా వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

కానీ ఆ అద్భుత రహస్యం నేటి వరకూ ఎవరికి అంతుబట్టడం లేదు. ఇక్కడ సమీపంలో మహా శివుడి ఆలయం ఉండటం, పక్కనే చెట్టు వేరు నుంచి నీరు రావడం దేవుడి మహిమ అని భక్తులు నమ్ముతున్నారు. పచ్చని అందాలతో అలరారుతున్న ఈ ఏజెన్సీ ప్రాంతం ఇప్పుడు అంతు చిక్కని రహస్యాలను కూడా తనలో నిక్షిప్తం చేసుకుంది. అనేక ఏళ్ల నుంచి ఈ చెట్టు వేరు నుంచి నీళ్లు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు, భక్తుల దాహాన్ని తీరుస్తుంది. చుట్టూ ఎత్తైన కొండలు కోనలు నడుమ ప్రకృతి అందాలతో విలసిల్లే ఈ కట్కురు ప్రాంతం లో ఈ వింత అందరినీ కట్టి పడేస్తుంది.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.