AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పిల్లి కాదు ప్రాణాలను హరించే కలి.. ఇద్దరు మహిళలు, ఓ కుక్క బలి

పిల్లే కదా.. పెంపుడు జంతువే కదాని లైట్ తీసుకోకండి. అది కరిస్తే అంతే సంగతులు. ఏం కాదులే అని నిర్లక్ష్యం చేయడం మరీ ప్రమాదకరం. నమ్మడం లేదా.. అయితే ఈ స్టోరీ చూడండి.

Andhra Pradesh: పిల్లి కాదు ప్రాణాలను హరించే కలి.. ఇద్దరు మహిళలు, ఓ కుక్క బలి
Cat
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 07, 2022 | 4:39 PM

Krishna District: కృష్ణా జిల్లా మొవ్వ మండలం( Movva mandal) వేములమడ(vemulamada)కు చెందిన సాలి కమల, బొడ్డు నాగమణిలను డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో పిల్లి కరిచింది. కంగారుపడ్డ కుటుంబసభ్యులు డాక్టర్‌ను సంప్రదించడంతో టేట్వాక్‌ ఇంజక్షన్ ఇచ్చారు. గాయం మానిపోవడంతో మరేం ఫర్వాలేదనుకున్నారు. ఎవరి పనుల్లో వాళ్లు ఉండిపోయారు. రెండు నెలల తర్వాత ఇద్దరి ఆరోగ్యం క్షిణించింది. కమలను మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్‌కి.. నాగమణిని విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఇద్దరికి పరీక్షలు చేసిన డాక్టర్లు రేబీస్ సోకినట్టు గుర్తించారు. అప్పటికే అది థర్డ్ స్టేజ్‌కి చేరుకుందని కుటుంబసభ్యులకి వివరించారు. పరిస్థితి చేయి దాటడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం గంటల వ్యవధిలోనే ఇద్దరూ చనిపోయారు. రేబీస్ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతోనే చనిపోయిందని కమల తనయులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగమణికి ముందుగా ఫిట్స్ ఆ తర్వాత హార్ట్‌ ఎటాక్‌ వచ్చి చనిపోయిందన్నాడు ఆమె భర్త బాబురావు.

ఇంజెక్షన్స్ చేయించుకోకుంటే ప్రాణాంతకమా? సెంట్రల్‌ నెర్వస్ సిస్టమ్‌పై వైరస్‌ ఎఫెక్ట్‌

రేబీస్.. ఈ మాట వినగానే పిచ్చి కుక్క, పద్నాలుగుసార్లు ఇంజెక్షన్లు గుర్తొస్తాయి. నిజంగా ఇంజెక్షన్స్‌ చేయించుకోకుంటే ప్రాణాంతకమవుతుందా? రేబీస్ అనేది ఒక వైరస్. అది సెంట్రల్ నెర్వస్ సిస్టమ్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ కారణంగానే బ్రెయిన్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడుతోంది. కుక్కలు, పిల్లులు, గబ్బిలాలు లాంటి జంతువులు ఈ వైరస్‌ని మనుషులకి ట్రాన్స్‌ఫర్‌ చేస్తాయి. ఈ వైరస్ తో పోరాడడానికి ఒకటే మార్గం. త్వరగా రెస్పాండ్ కావడం. ప్రతి సంవత్సరం కనీసం 60వేల మంది రేబీస్ తో ప్రాణాలు విడుస్తున్నారు. వ్యాక్సిన్ ఉన్నా.. సరైన సమయానికి అందుబాటులో లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది.

పిల్లి కరిస్తే ఏం కాదనే ధీమాతో ఉన్నారు కమల, నాగమణి. సకాలంలో రేబీస్ వ్యాక్సిన్ తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని స్పష్టమవుతోంది. నిజానికి రేబీస్ వైరస్‌కి ఎక్స్‌పోజ్ అయ్యాక వరుసపెట్టి ఇంజెక్షన్లు చేయించుకోవాలి. అప్పుడే ఇన్‌ఫెక్షన్ కాకుండా ఉంటుంది. మరోవైపు కమల, నాగమణిని కరిచిన పిల్లి ఓ కుక్కను కరవడంతో అది కూడా చనిపోయిందంటున్నారు గ్రామస్తులు. ఇప్పటికైనా ఊళ్లో జంతువుల బెడద లేకుండా చూడాలని వేడుకుంటున్నారు.

Also Read: Telangana Farmers: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్… రూ.50 వేలలోపు రుణాలు అప్పటికల్లా మాఫి

'ముందు నీ స్ట్రైక్ రేట్ చూసుకో.. కోహ్లీ జోలికొస్తే ఊరుకోం'
'ముందు నీ స్ట్రైక్ రేట్ చూసుకో.. కోహ్లీ జోలికొస్తే ఊరుకోం'
అక్షయ తృతీయ రోజు బంగారం కాకుండా.. తప్పక కొనాల్సిన వస్తువులు ఏవంటే
అక్షయ తృతీయ రోజు బంగారం కాకుండా.. తప్పక కొనాల్సిన వస్తువులు ఏవంటే
అలాంటి పరిస్థితి ఏ ఆర్టిస్టుకు రాకూడదు.. ఈ నటి కష్టాలు తెలిస్తే..
అలాంటి పరిస్థితి ఏ ఆర్టిస్టుకు రాకూడదు.. ఈ నటి కష్టాలు తెలిస్తే..
ఆ బౌలరంటే ముంబై ఇండియన్స్‌కు భయం: రాయుడు
ఆ బౌలరంటే ముంబై ఇండియన్స్‌కు భయం: రాయుడు
తండ్రి షాపులో రూ.2 లక్షలు చోరీ.. ఐఫోన్‌ కొన్న ఏడో తరగతి పిల్లోడు!
తండ్రి షాపులో రూ.2 లక్షలు చోరీ.. ఐఫోన్‌ కొన్న ఏడో తరగతి పిల్లోడు!
టాలీవుడ్ షూటింగ్స్‎తో కళ కళ.. హీరోలు అందరూ సెట్స్‎లోనే..
టాలీవుడ్ షూటింగ్స్‎తో కళ కళ.. హీరోలు అందరూ సెట్స్‎లోనే..
5 సినిమాలు చేస్తే నాలుగు సూపర్ హిట్టే..
5 సినిమాలు చేస్తే నాలుగు సూపర్ హిట్టే..
అజహరుద్దీన్ పేరు తొలగించొద్దు.. హెచ్‌సీఏకు షాకిచ్చిన హైకోర్ట్
అజహరుద్దీన్ పేరు తొలగించొద్దు.. హెచ్‌సీఏకు షాకిచ్చిన హైకోర్ట్
కొత్త సమస్యతో బాధపడుతోన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్
కొత్త సమస్యతో బాధపడుతోన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్
చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..
చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..