Schools Reopening: నేటి నుంచి బడులు పునఃప్రారంభం.. ఆలస్యంగా ‘విద్యాకానుక కిట్లు’ పంపిణీ! ఎందుకంటే..

రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు జూన్ 12వ తేదీతో ముగిశాయి. సెలవుల అనంతరం రాష్ట్రంలోని పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం అవుతాయి. దీంతో 2024–25 విద్యా సంవత్సరం నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో మొత్తం 62,023 పాఠశాలలు ఉండగా, వీటిలో ప్రభుత్వ యాజమాన్యంలో 44,954, ప్రైవేటు యాజమాన్యంలో 15,784, ఎయిడెడ్‌లో మరో 1225 పాఠశాలలు ఉన్నాయి...

Schools Reopening: నేటి నుంచి బడులు పునఃప్రారంభం.. ఆలస్యంగా 'విద్యాకానుక కిట్లు' పంపిణీ! ఎందుకంటే..
Schools Reopening in AP
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 13, 2024 | 8:44 AM

అమరావతి, జూన్‌ 13: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు జూన్ 12వ తేదీతో ముగిశాయి. సెలవుల అనంతరం రాష్ట్రంలోని పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం అవుతాయి. దీంతో 2024–25 విద్యా సంవత్సరం నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో మొత్తం 62,023 పాఠశాలలు ఉండగా, వీటిలో ప్రభుత్వ యాజమాన్యంలో 44,954, ప్రైవేటు యాజమాన్యంలో 15,784, ఎయిడెడ్‌లో మరో 1225 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో మరో 60 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర పాఠశాలలు మినహా మిగిలిన అన్ని పాఠశాలలు గురువారం నుంచి ప్రారంభమవుతాయి. కేంద్రీయ విద్యాలయాలు జూన్‌ 21 నుంచి, నవోదయ విద్యాలయాలు జూన్‌ 30 నుంచి ప్రారంభమవుతాయి. జూన్‌ 12నే బడులు తెరుచుకోవాల్సి ఉండగా.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో పాఠశాలల పునఃప్రారంభం గురువారానికి వాయిదా పడింది. మరోవైపు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయి.

పాఠశాలలు మళ్లీ తెరచుకోవడంతో పాఠశాలల్లో అన్ని వసతులు సక్రమంగా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పీఎం పోషణ్‌ గోరుముద్దను అంటే మధ్యాహ్న భోజనంను కూడా ఈ రోజు నుంచే విద్యార్థులకు అందించనున్నారు. ప్రస్తుతానికి గతేడాది మాదిరిగానే విద్యార్ధులకు భోజనం అందించనున్నారు. కొత్త విద్యాశాఖ మంత్రి బాధ్యతలు తీసుకున్నాక తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. గతేడాది పాఠశాలలు తెరచిన మొదటి రోజే విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్లను రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించారు.

ప్రతి విద్యార్థికి ఉచితంగా ద్విభాషా పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్ –తెలుగు) నోట్‌ బుక్స్, వర్క్‌ బుక్స్, కుట్టు కూలితో సహా 3 జతల యూనిఫామ్‌ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు అందించారు. ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీ, ఒకటో తరగతి పిల్లలకు పిక్టోరియల్‌ డిక్షనరీతో కూడిన కిట్‌ను ఇచ్చారు. ఇక విద్యా సంవత్సరానికి కూడా 36 లక్షల మంది విద్యార్థులకు గతేడాది మాదిరిగానే అందించేందుకు విద్యాకిట్‌లు సిద్ధంగా ఉన్నా జూన్‌ 20 తర్వాతే విద్యార్థులకు అవి అందే అవకాశం ఉంది. ఈ ఏడాది వెయ్యి ప్రభుత్వ సీబీఎస్‌ఈ స్కూళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటికీ కలిపి కొత్త విద్యా క్యాలెండర్‌ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.