Andhra Pradesh: వీఆర్వో హత్య కేసులో ట్విస్ట్‌.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!

మానవత్వం మంట కలిసి పోతుంది. అక్రమ సంబంధాలు తన మన తేడా లేకుండా సొంత వారినే కడతేరుస్తున్నాయి. ప్రశాంతంగా సాగాల్సిన సంసారాన్ని నరకం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధానికి అలవాటు పడి భర్తను కడతేర్చిన సంఘటన రాయచోటి పట్టణంలో చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు రెండు రోజుల్లో చేదించి నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు..

Andhra Pradesh: వీఆర్వో హత్య కేసులో ట్విస్ట్‌.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
Rajampet Constituency Veerballi Vro Murder Case
Follow us
Sudhir Chappidi

| Edited By: Srilakshmi C

Updated on: Sep 13, 2023 | 4:57 PM

రాయచోటి, సెప్టెంబర్‌ 13: మానవత్వం మంట కలిసి పోతుంది. అక్రమ సంబంధాలు తన మన తేడా లేకుండా సొంత వారినే కడతేరుస్తున్నాయి. ప్రశాంతంగా సాగాల్సిన సంసారాన్ని నరకం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధానికి అలవాటు పడి భర్తను కడతేర్చిన సంఘటన రాయచోటి పట్టణంలో చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు రెండు రోజుల్లో చేదించి నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపించారు.

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం ప్రకాష్ నగర్ పాపిరెడ్డి కోళ్ల ఫారాం దగ్గర వీఆర్వో ఆంజనేయులు నాయుడు అనుమానాస్పద మృతి చెందారు. ఈయన ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి మండలం లో వీరబల్లి టౌన్ వీఆర్వో గా ఆంజనేయులు నాయుడు విధులు నిర్వర్తిస్తున్నారు. ఉన్నట్లుండి ఆదివారం రోజు తెల్లవారు జామున ఆంజనేయులు మృతి చెందినట్లు ఆయన బార్య నందిని పోలీసులకు తెలిపింది. అయితే ఈకేసులో పెద్ద ట్విస్ట్ ఏమిటంటే చనిపోయున వీఆర్వో భార్యే ఈ కేసులో ప్రధాన నిందితురాలు. అక్రమ సంబంధానికి అలవాటు పడి భర్తను చంపాలని పక్కా ప్లాన్ చేసి పథకం ప్రకారం తన ప్రియుడు చిన్నపరెడ్డితో భర్త చావుకు ప్లాన్ గీసింది. నందిని అనుకున్నదే తడవుగా చిన్నపరెడ్డితో తన ప్లాన్ ను అమలు చేసింది. చిన్నపరెడ్డి తన స్నేహితుడి సహాయంతో వీఆర్వో ఆంజనేయులు నాయుడుని పథకం ప్రకారం హత్య చేశాడు. హత్య అనంతరం ఏం ఎరగని నంగనాచి లాగా భార్య ఏడుస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చింది. భార్యపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేయగా అసలు సూత్రధారి సొంత భార్య నందిని నేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమెను ఆమెతోపాటు ప్రియుడు చిన్నపురెడ్డిని అతని స్నేహితుడు సురేష్ ను ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హత్యకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించిన రాయచోటి డీఎస్పీ

రాయచోటి పట్టణంలో ఆదివారం హత్య కాబడిన వీఆర్వో ఆంజనేయులు నాయుడు కేసును రెండు రోజులలో ఛేదించామని, పథకం ప్రకారమే ప్రియుడు చిన్నప రెడ్డి అతని స్నేహితుడు సురేంద్ర రెడ్డి తో కలిసి భర్త ఆంజనేయులు నాయుడును భార్య నందిన్ హత్య చేయించిందని డీయస్పీ తెలిపారు. భర్త ఆంజనేయులు నాయుడు తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని, అందుకే అంతమొందించినట్లు డీయస్పీ తెలిపారు. భార్య నందిని ప్రవర్తన పై అనుమానంతో ప్రవర్తన మార్చుకోవాలని మృతుడు ఆంజనేయులు నాయుడు మందలించాడు. ఈ విషయం బయటకు తెలిసిపోవడంతో చేసేదేమీ లేక భర్తను హత్య చేయడమే సరైన పరిష్కారం అనుకున్న నందిని అనుకున్నదే తడువుగా విషయాన్ని తన ప్రియుడికి తెలిపింది. అనంతరం హత్యకు పక్కా ప్లాన్ గీసింది. ప్రియుడు చిన్నపరెడ్డి తో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది.  చిన్నప నాయుడు నిద్రిస్తున్న సమయంలో హత్య చేసినట్లు నిందితులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వివరాలు వెల్లడించారు డీఎస్పీ మహబూబ్ భాష. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.