Horoscope Today: ప్రయాణాల్లో వారు కాస్త జాగ్రత్త..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Today Horoscope (November 13, 2024): మేష రాశికి చెందిన ఉద్యోగులకు పని భారం ఎక్కువగా ఉండే అవకాశముంది . వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు జీత భత్యాలు, పదోన్నతి విషయంలో శుభవార్తలు అందుకునే అవకాశహుంది మిథున రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (నవంబర్ 13, 2024): మేష రాశికి చెందిన ఉద్యోగులకు అదనపు పని భారం ఉంటుంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు జీత భత్యాలు, పదోన్నతి విషయంలో శుభవార్తలు అందుతాయి. మిథున రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు సంబంధించిన అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు పని భారం ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు కలుగుతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కొందరు బంధుమిత్రులతో బాగా ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు జీత భత్యాలు, పదోన్నతి విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉండవచ్చు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనివ్వడంతో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. సోదరులతో ఆస్తి, ఆర్థిక వివాదాలు పరి ష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశిం చిన అవకాశాలు అందుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక వ్యవహా రాలు చాలావరకు చక్కబడతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వాతావరణం కూడా ప్రోత్సాహ కరంగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులు, వ్యవహా రాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి చేయవద్దు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల లాభం ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగడం వల్ల తగినంత విశ్రాంతి లభించకపోవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు బిజీగా ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అనుకున్న పనుల్ని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. చాలా కాలంగా ఒత్తిడి పెడుతున్న వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేప ట్టిన పనుల్ని సకాలంలో, సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల తీరుతెన్నులు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లా సంగా పురోగమిస్తాయి. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి ఖాయం కావచ్చు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయ మార్గాలు బాగా సంతృప్తి కలిగిస్తాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణముం టుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన కార్యక్రమాలు, కార్యకలాపాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉన్న ప్పటికీ వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోక పోవడం మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యానికి లోటుండదు.
ధనుస్సు (మూల, పూర్వాషాడ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా పురో గతి చెందుతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు ఒత్తిడిని కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మరింత మంచి సంస్థలోకి మారాలన్న కోరిక నెరవేరు తుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా, సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆస్తి వివాదం అనుకోకుండా పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమ స్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారాల్లో లాభాలపరంగా అను కూల పరిస్థితులుంటాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వస్త్రాభ రణాలు కొనే అవకాశం ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.