AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bus Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీలో ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు బోల్తా

Bus Accident: ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాదం సమయంలో బస్సులో 20 మంది

Bus Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీలో ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు బోల్తా
Subhash Goud
|

Updated on: Nov 03, 2025 | 9:56 PM

Share

Bus Accident: ఇటీవల కాలం నుంచి రోడ్డు ప్రమాదాలు తీవ్రతరం అవుతున్నాయి. బస్సు ప్రమాదాలతో ఎందరో ప్రయాణికులు బలవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణమని తెలుస్తోంది.

తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం మరువకముందే ఏపీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఇలా ఒక్కటేమిటి ప్రతి రోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్‌కు చెందిన బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమత్తం ఆస్పత్రికి తరలించారు.లింగపాలెం మండలం జూబ్లీనగర్‌ దగ్గర ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఈ బస్సును భారతి ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించారు.

ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాదం సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Fridge Cooling: మీ ఫ్రిడ్జ్‌ కూలింగ్‌ కావడం లేదా..? ఈ కారణాలు కావచ్చు..!

ఇది కూడా చదవండి: LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ పని చేయకుంటే సిలిండర్‌పై సబ్సిడీ నిలిచిపోతుంది?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి