Gold Mines: బయటపడ్డ రూ. 60 లక్షల కోట్ల బంగారు నిధి.. భారత్ జాక్‌పాట్ కొడుతుందా?
Gold Mines: భూగర్భంలో భారీ నిల్వలు ఉన్న ఈ మూడు దేశాలు భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుతాయి. అయితే, భారత్‌కు ఇక్కడ ఒక శుభవార్త ఉంది. బంగారు నిల్వలు..

Gold Mines: బంగారం కేవలం లోహం కాదు, సంపదకు, భద్రతకు, ముఖ్యంగా భారతీయుల సాంస్కృతిక జీవితానికి ప్రతీక. మన దేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారు నిల్వల విషయంలో మనం ఇంకా వెనుకబడి ఉన్నాం. కానీ, ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఒక అద్భుతమైన అవకాశం మన దేశానికి జాక్‌పాట్ లాంటిదని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా భూమిలో దాదాపు 2,44,000 మెట్రిక్ టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. అయితే, ఇప్పటివరకు 1,87,000 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే తవ్వకాల ద్వారా బయటపడింది. అంటే, ఇంకా 57,000 మెట్రిక్ టన్నుల విలువైన పసిడి భూగర్భంలో ఉంది.
ఇది కూడా చదవండి: Gold Price: ఉన్నట్టుండి భారీ దెబ్బకొట్టిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలిస్తే..
అత్యధికంగా గుర్తించిన నిల్వలు ఎక్కడ ఉన్నాయి?
ప్రపంచంలోనే అత్యధికంగా ఇంకా తవ్వకానికి నోచుకోని బంగారు నిల్వలు ఉన్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు ఇవే:
- ఆస్ట్రేలియా: గుర్తించని బంగారు నిల్వల పరంగా ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి భూగర్భంలో దాదాపు 12,000 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని అంచనా. దీని ప్రస్తుత విలువ సుమారు $720 బిలియన్లు (రూ.60 లక్షల కోట్లు).
- రష్యా: రష్యాలోనూ ఆస్ట్రేలియాకు సమానంగా దాదాపు 12,000 మెట్రిక్ టన్నుల భారీ బంగారు నిల్వలు భూగర్భంలో కనిపిస్తున్నాయి.
- ఇండోనేషియా: ఈ జాబితాలో ఇండోనేషియా మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ సుమారు 3,600 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయని అంచనా.
భారత్‌కు ‘జాక్‌పాట్’ ఎందుకు?
భూగర్భంలో భారీ నిల్వలు ఉన్న ఈ మూడు దేశాలు భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుతాయి. అయితే, భారత్‌కు ఇక్కడ ఒక శుభవార్త ఉంది. బంగారు నిల్వలు పుష్కలంగా ఉన్న ఆస్ట్రేలియా, రష్యా, ఇండోనేషియా మూడు దేశాలు కూడా భారతదేశానికి స్నేహపూర్వక దేశాలు. ఈ బలమైన దౌత్య సంబంధాల కారణంగా భారత్ ఈ దేశాల నుండి తక్కువ ధరలకు లేదా బంగారాన్ని దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఇది దేశీయంగా బంగారు ధరల స్థిరత్వానికి, సరఫరాకు తోడ్పడి, భారత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందని ఆర్థిక నిపుణులు విశ్వసిస్తున్నారు. భారతీయ బంగారం ప్రియులకు ఇది నిజంగా ఒక సంతోషకరమైన అంశంగా చెప్పవచ్చు.
School Holiday: నేడు తెలంగాణలోని ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు.. కలెక్టర్ ఉత్తర్వులు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




