- Telugu News Photo Gallery Business photos Gold and silver prices rise again.. What is the price of 10 grams?
Gold Price: ఉన్నట్టుండి భారీ దెబ్బకొట్టిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలిస్తే..
Gold Price: పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని ఎక్కువగా గమనిస్తున్నారు. ఫలితంగా, వారు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏదీ ఏమైనా ప్రస్తుతం బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గినా..
Updated on: Oct 29, 2025 | 10:05 AM

Gold Price: బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. తగ్గినట్లే తగ్గి భారీ దెబ్బ కొడుతుంటుంది. గత నాలుగైదు రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నబంగారం, వెండి ధరలు.. ఉన్నట్టుండి బుధవారం భారీగా పెరిగింది. అక్టోబర్29వ తేదీన తులం బంగారంపై మళ్లీ ఏకంగా రూ.760 ఏగబాకింది. అదే వెండి ధరపై వెయ్యి రూపాయలు పెరిగింది.

అయితే గుడ్ రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం..24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.760 పెరుగగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.700 వరకు ఎగబాకింది. దేశీయంగా ధరలను పరిశీలిస్తే ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,21,580 వద్ద చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,450 వద్ద ఉంది. ఇక కిలో వెండి ధర రూ. 1 లక్షా 52,000 వద్ద కొనసాగుతోంది. గత నాలుగైదు రోజు నుంచి పడిపోతున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పైకి లేచాయి.

వెండి గురించి చెప్పాలంటే, ఢిల్లీలో వరుసగా రెండు రోజుల్లో కిలోకు రూ.4100 తగ్గింది. మూడు రోజుల స్థిరత్వానికి ముందు వరుసగా నాలుగు రోజుల్లో కిలోకు రూ.17 వేలు తగ్గింది. నేడు వెయ్యి రూపాయలు పెరిగింది.

బంగారం కొనేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి: బంగారు ఆభరణాలను కొనేటప్పుడు నాణ్యతను విస్మరించవద్దు. హాల్‌మార్క్‌ను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఆభరణాలను కొనండి. ఇది ప్రభుత్వం బంగారంపై హామీ ఇస్తుంది. భారతదేశపు ఏకైక ఏజెన్సీ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌లను నిర్ణయిస్తుంది.

ప్రతి క్యారెట్‌కు వేరే హాల్‌మార్క్ సంఖ్య ఉంటుంది. అందుకే మీరు బంగారం కొనుగోలు చేసే ముందు వీటిని పరిగణించి అర్థం చేసుకోవాలి. హాల్ మార్క్ లేనిది బంగారు అభరణాలను కొనుగోలు చేయవద్దని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.




