AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Holiday: నేడు తెలంగాణలోని ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు.. కలెక్టర్‌ ఉత్తర్వులు!

School Holiday: తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 22 జిల్లాల్లోని 403 మండలాలపై తుపాను ప్రభావం పడిపనట్లు తెలిపింది. నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈదురుగాలులు, భారీవర్షాలతో మొంథా ముంచేసింది

School Holiday: నేడు తెలంగాణలోని ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు.. కలెక్టర్‌ ఉత్తర్వులు!
Subhash Goud
|

Updated on: Oct 29, 2025 | 11:17 AM

Share

School Holiday: మొంథా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్ష బీభత్సం ఉండగా, ఏపీ రాష్ట్ర మాత్రం వర్షాలతో ముంచెత్తుతోంది. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మొంథా తుఫాను కారణంగా ఏపీలో చాలా ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ఇప్పుడు తెలంగాణలో ఓ జిల్లాలో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

మొoథా తూఫాను దృష్ట్యా బుధవారం ఖమ్మం జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా బుధవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. అయితే పరిస్థితులను బట్టి మరిన్ని సెలవును పొడిగిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: Aadhaar: ఆధార్‌ను ఏ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు.. UIDAI నియమాలు ఏం చెబుతున్నాయి?

తెలంగాణలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, 8 జిల్లాలకు ఆరెంజ్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి, ఖమ్మం, ములుగు, నాగర్‌కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు శుభవార్త.. భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత తగ్గిందంటే..

తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 22 జిల్లాల్లోని 403 మండలాలపై తుపాను ప్రభావం పడిపనట్లు తెలిపింది. నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈదురుగాలులు, భారీవర్షాలతో మొంథా ముంచేసింది. సింగరేణి వ్యాప్తంగా నిలిచింది బొగ్గు ఉత్పత్తి. మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు గనుల్లో నిలిచిపోయాయి తవ్వకాలు. వర్షంతో పంటలు దెబ్బతిన్నాయని పత్తి, వరి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: EPFO Pension Rule: మీరు పదేళ్ల తర్వాత ఒక కంపెనీని వదిలివేస్తే పెన్షన్ వస్తుందా? నియమాలు ఏంటి?

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..