AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smugglers vs Police: శభాష్ పోలీస్.. గంజాయి స్మగ్లర్ల కోసం ఛేజింగ్.. సీన్ చూస్తే రోమాలు నిక్కబొడవాల్సిందే..!

Smugglers vs Police: ముందు ఒక కారు రయ్యిరయ్యిన రోడ్డుపై దూసుకెళుతోంది.. వెనుక పోలీసులు(Police) కూడా

Smugglers vs Police: శభాష్ పోలీస్.. గంజాయి స్మగ్లర్ల కోసం ఛేజింగ్.. సీన్ చూస్తే రోమాలు నిక్కబొడవాల్సిందే..!
Shiva Prajapati
|

Updated on: Jan 25, 2022 | 8:31 PM

Share

Smugglers vs Police: ముందు ఒక కారు రయ్యిరయ్యిన రోడ్డుపై దూసుకెళుతోంది.. వెనుక పోలీసులు(Police) కూడా అదే స్పీడులో ఛేజింగ్(Chasing) చేస్తున్నారు. ఈలోగా ముందున్న కారు బారికేడ్లను డికొడుతూ ముందుకు సాగుతోంది. కొంతదూరం వెళ్ళాక కారులో ప్రయాణస్తున్న వారికి గత్యంతరం లేదు. సీన్ అర్ధమైపోయింది. దింతో కారును ఆపి మదుం కాలువలోకి దుకేశారు. అయినా పోలీసులు విడిచిపెట్టలేదు. కాలువను చుట్టూముట్టి ఇద్దరినీ పట్టుకున్నారు. కారును సీజ్ చేశారు. వెరిఫై చేసేసరికి వారిద్దరూ గంజాయి స్మగ్లర్లు(Ganja Smuggling). పోలీసులను(AP Police) చూసి పారిపోయేందుకు యత్నింంచి అడ్డంగా దొరికిపోయారు. విశాఖజిల్లా నర్సీపట్నం లో జరిగిన సీన్ తో శభాష్ ఖాకి అన్నారు స్థానికులు.

వివరాల్లోకి వెళ్తే.. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి నుంచి గంజాయి కొనుగోలు చేసిన స్మగ్లర్లు.. కారులో మహారాష్ట్ర తీసుకెళ్లే క్రమంలో నర్సీపట్నం చేరుకున్నారు. తనిఖీలు జరగొచ్చనే కారణంతో వీరు కారును వేగంగా నడుపుతూ వెళ్తున్నారు. దీనిని గమనించిన నర్సీపట్నం ట్రాఫిక్ పోలీసులు ఊరుకుంటారా..? అనుమానం వచ్చి కారును వెంబడించారు. పోలీసులను చుసిన కారులో ఉన్న వాళ్ళు వారిబారినుంచి బయటపడేందుకు కారును వేగంగా నడిపారు. ఈ క్రమంలో శ్రీకన్య సెంటర్లో ఏర్పాటు చేసిన బారి కేడ్లను డీ కొట్టి ముందుకు వెళ్లారు. ముందు స్మగ్లర్లు, వారి వెంబడిస్తూ పోలీసులు ఒకదాని వెనుక మరొకటి వెళుతూ సినిమాలో చేజింగ్ సీన్ ను తలపించారు. పోలీసులు కారును వెంబడిస్తుండటంతో పట్టుబడక తప్పదని గ్రహించిన స్మగ్లర్లు.. కారును వదిలి బొడ్డపల్లి వంతెన కింద కాలువలోకి దూకేశారు.

స్థానికుల సాయంతో అత్యంత చాకచక్యంగా నిందితులందరినీ ట్రాక్ చేశారు. మహారాష్ట్రకు చెందిన కారులో.. 240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు ఇద్దరిని విచారిస్తున్నారు.

Also read:

Gudivada Casino Politics: రగులుతున్న కేసినో రగడ.. మంత్రి నానిపై సోమువీర్రాజు సంచలన కామెంట్స్..

Bhavana: క్యూట్ స్టిల్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న భావన లేటెస్ట్ ఫోటోస్

Viral Video: కోడిపై పిల్లి దాడి చేసింది.. కానీ పందెం రివర్స్ .. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..