AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కోడిపై పిల్లి దాడి చేసింది.. కానీ పందెం రివర్స్ .. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

పిల్లులు ఎంత తెలివైనవో అంతే అందమైనవి కూడా.. పిల్లులు చేసే కొంటె పనులు అందే స్థాయిలో ఉంటాయి. నక్కి నక్కి వంటగదిలోకి రావడం.. 

Viral Video: కోడిపై పిల్లి దాడి చేసింది.. కానీ పందెం రివర్స్ .. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Cat
Sanjay Kasula
|

Updated on: Jan 25, 2022 | 8:18 PM

Share

పిల్లులు ఎంత తెలివైనవో అంతే అందమైనవి కూడా.. పిల్లులు చేసే కొంటె పనులు అందే స్థాయిలో ఉంటాయి. నక్కి నక్కి వంటగదిలోకి రావడం..  నెమ్మదిగా పాలు మొత్తం తాగి, రహస్యంగా బయటకు రావడం మనం చాలా సార్లు చూసి ఉంటాం. అయితే పిల్లలు వేటలో వాటి నేర్పరితనం ముందు చిరుత పులులు కూడా చిన్నపోతాయి. సింహాలు, పులులు ఎలా పొంచిఉంచి వేటాడతాయో అదే విధంగా పిల్లులు కూడా తమ వేటాడుతాయి. ఎరకు తప్పించుకునే అవకాశం లేకుండా పొంచి ఉంటాయి. అయితే, కొన్నిసార్లు అవి కూడా విఫలమవుతాయి. అలాంటి వీడియో ఒకటి ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు నవ్వుకుంటారు.

వాస్తవానికి, వైరల్ అవుతున్న వీడియోలో పిల్లి కోడి పుంజుపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ దాని పందెం ఎదురుదాడికి దిగడంతో పరుగులు తీస్తుంది. వీడియోలో పిల్లి పుంజును ఎలా చూస్తుందో.. దానిని పట్టుకోవడానికి దూకినట్లు మీరు చూడవచ్చు. కానీ   ఇప్పటికే అప్రమత్తంగా ఉన్న పుంజు పిల్లి  ఈ కదలికను ఇప్పటికే అర్థం చేసుకుంది. కాబట్టి పిల్లి తనపై దాడి చేసిన వెంటనే ఎదురు దాడి చేసింది. తన ముక్కుతో పొడవటం మొదలు పెట్టింది. ఇప్పుడు తనపై జరిగిన దాడిని చూసిన పిల్లి వెంటనే అక్కడి నుంచి పారిపోయింది.

ఈ వీడియోలో చూడండి..

View this post on Instagram

A post shared by Thecatvibess (@thecatvibess)

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో thecatvibess అనే ఐడితో షేర్ చేయబడింది. దీనికి ఇప్పటివరకు 2 లక్షల 40 వేల వ్యూస్  వచ్చాయి. అయితే 9 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు. అదే సమయంలో చాలా మంది వీడియోను చూసి ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు.

ఇవి కూడా చదవండి: Telangana Corona: తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై కీలక ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్..

UP Election 2022: సమాజ్‌వాదీ పార్టీకి మరో షాక్, బీజేపీలో చేరిన జలాల్‌పూర్ ఎమ్మెల్యే..