Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో చిరుత దాగుంది.. కనిపెడితే మీరే జీనియస్.!

Viral Photo: ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరికి చేతుల్లోనూ మొబైల్ ఉంటోంది. ఎంటర్టైన్మెంట్(Entertainment) కోసం గేమ్స్ నుంచి వైరల్ వీడియోల వరకు...

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో చిరుత దాగుంది.. కనిపెడితే మీరే జీనియస్.!
Leopard
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 25, 2022 | 7:52 PM

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరికి చేతుల్లోనూ మొబైల్ ఉంటోంది. ఎంటర్టైన్మెంట్(Entertainment) కోసం గేమ్స్ నుంచి వైరల్ వీడియోల వరకు అన్ని ఒక్క క్లిక్‌తో లభిస్తున్నాయి. ఇక చాలామంది సోషల్ మీడియా(Social Media)లో తరచూ యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. నెట్టింట కొన్ని ఫోటోలు అప్పుడప్పుడూ మన కళ్ళను మోసం చేస్తుంటాయి. మన కళ్లకు కనిపించేది ఒకటైతే.. వాస్తవంగా అక్కడ వేరొకటి ఉంటుంది. అలాంటి వాటిని ఆప్టికల్ ఇల్యుషన్స్, ఫోటో పజిల్స్(Photo Puzzles) అని అంటుంటారు. ఫోటో పజిల్స్ అనేవి వీకెండ్ బుక్స్, మ్యాగజైన్లలో వచ్చే పద సంపత్తి లాంటివి కాదు. ఫోటో పజిల్స్‌ను సాల్వ్ చేయాలంటే మన కళ్లలో పదునుండాల్సిందే. కళ్లలో పదునుంటే.. క్షణాల్లో పజిల్స్ సాల్వ్ చేసేయగలం. తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది.? అని కనిపెట్టడంలో నెటిజన్లు బుర్రను గోక్కుంటున్నారు. మరి అదేంటో చూసేద్దాం పదండి..

Also Read: Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే! అంత ఈజీ కాదండోయ్.!

పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుత దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి పర్వత శ్రేణీలా ఉన్న ఆ ప్రాంతంలో మంచు చిరుత ఇంచక్కా సేద తీరుతోంది. ఇక ఈ ఫోటో పజిల్‌ను సాల్వ్ చేయడానికి నెటిజన్లు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయితే దాదాపుగా నూటికి 95 శాతం మంది ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే రాళ్లు, చుట్టూ ఎండు గడ్డి ఉండటంతో.. వాటి రంగులో చిరుత రంగు కూడా ఇమిడిపోయింది. దీనితో ఆ చిరుతను కనిపెట్టేలేక నెటిజన్లు పప్పులో కాలేశారు. లేట్ ఎందుకు మీరు కూడా ఈ ఫోటో పజిల్‌ను ఓసారి ట్రై చేయండి. తీక్షణంగా చూస్తే మొదటి ట్రయిల్‌లోనే కనిపెట్టేస్తారు. ఒకవేళ సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి.

Also Read: Dragon Fruit: ఈ 3 వ్యాధులను దూరం చేసే దివ్య ఔషధం.. తింటే తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

ఇదిలా ఉంటే.. మంచు చిరుతలు అరుదైన జాతికి చెందిన జంతువులు. ఇవి ఎక్కువగా కొండలు, పర్వతాలపై తమ జీవనాన్ని సాగిస్తుంటాయి. వాటికీ నీలం రంగు గొర్రెలు ఇష్టమైన ఆహారం అని చెప్పొచ్చు. అలాగే సాయంత్రం వేళ మంచు చిరుతలు వేటాడుతుంటాయి. అవి ఆ సమయంలోనే చురుగ్గా ఉంటాయి.

Also Read: 

మాతోనే గేమ్సా.! కుక్కను మింగేయాలనుకున్న కొండచిలువకు చుక్కలు చూపించారు.. వైరల్ వీడియో!

ఈ ఉంగరాల జుట్టు చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? సొగసులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.!