Kakinada: ఆ పల్లెల్లో భయం.. భయం.. 18 రోజులైనా వీడని పులి మిస్టరీ..

ఆ పల్లెల్లో 18 రోజులైనా భయం పోలేదు. బయట అడుగు పెట్టాలంటేనే అక్కడి రైతులు వణుకుతున్నారు. యస్, పోతులూరు, ఒమ్మంగి, పొదురుపాక గ్రామాల్లో, ప్రస్తుతం పులి ఊసులు తప్ప వేరే మాట వినిపించడం లేదు.

Kakinada: ఆ పల్లెల్లో భయం.. భయం.. 18 రోజులైనా వీడని పులి మిస్టరీ..
Tiger
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Jun 08, 2022 | 10:43 AM

కాకినాడ(Kakinada) జిల్లాలో పెద్దపులి(Tiger) అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. దాన్ని పట్టుకోవడానికి ఎన్ని ఎత్తులు వేసినా, చిక్కకుండా తిరుగుతోంది. ప్రత్తిపాడు మండలంలో ఒమ్మంగి గ్రామ సమీపంలోని సరుగుడు తోటల్లో, పెద్దపులి ఆనవాళ్లు కనిపించినప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. పులి బాధను తప్పించడానికి అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దానంతట అది అడవికి వెళ్లేలా చేసినా అది సాధ్యపడలేదు. బోనుల్లో బంధించాలని చూసినా తప్పించుకుంటోంది. రెండోసారి బోను చూసి పక్కనుంచి వెళ్లిపోయింది. ట్రాపింగ్‌ కెమెరాల్లో దాని తెలివి చూసి అవాక్కవుతున్నారు అధికారులు. పోతులూరు, ఒమ్మంగి, పొదురుపాక పాండవులపాలెం, శరభవరం గ్రామాల మధ్య సరుగుడు తోటలు, దట్టమైన చెట్లతో ఉండే మెట్టల్లో ఇది సంచరిస్తోంది.

రోజూ 15 కిలోమీటర్ల మేర పులి ప్రయాణం ఉంటోందని ఫారెస్ట్‌ ఆఫీసర్లు చెబుతున్నారు. తాజాగా, పెద్దిపాలెం దగ్గర పెద్దపులి అడుగులు కనిపించాయి. దీంతో పులి కిష్టమూరిపేట కొండవైపు వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. పులిని బంధించడానికి ఆత్మకూరు నుంచి ఎన్‌ఎస్‌ఆర్టీ బృందం కూడా వచ్చింది. దాదాపు 120 మంది క్షేత్రస్థాయి సిబ్బంది, చీఫ్‌ కన్జర్వేటర్‌ నుంచి సెక్షను స్థాయి అధికారి వరకూ మరో 30 మంది పులి ప్రభావిత ప్రాంతంలో ఉంటున్నారు.

పులులను పట్టుకోవడంలో ఆరితేరిన నాగార్జునసాగర్‌, శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌కు చెందిన 16 మంది కూడా పెద్దిపాలెం వచ్చారు. రెండు బృందాలుగా ఏర్పడి 8 బోనులు ఏర్పాటు చేశారు. పులి బోనుకు చిక్కకపోతే మత్తుమందు ఇచ్చేందుకు వైల్డ్‌లైఫ్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ రెస్కూ పార్టీ ప్లాన్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!