Andhra Pradesh: హీట్ పెంచుతున్న పొలిటికల్ ట్వీట్లు.. అంబటి రాంబాబుపై దేవినేని ఉమ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ట్వీట్ల వార్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. ట్వీట్టర్ వేదికగా, టీడీపీ-వైసీపీ మధ్య డైలాగ్స్ పేలుతున్నాయి. అక్కడితో ఆగకుండా, సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లాయి. హాట్‌హాట్ పాలిటిక్స్‌కు...
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ట్వీట్ల వార్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. ట్వీట్టర్ వేదికగా, టీడీపీ-వైసీపీ మధ్య డైలాగ్స్ పేలుతున్నాయి. అక్కడితో ఆగకుండా, సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లాయి. హాట్‌హాట్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో టీడీపీ-వైసీపీ(TDP-YCP) మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంటుంది. తాజాగా, ట్వీట్ వార్ మొదలైంది. ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకుంటూ, విమర్శలు గుప్పించుకున్నారు. కానీ, అవి శ్రుతిమించి, సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేసేవరకు వెళ్లాయి. గతవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యల పేరుతో ట్వీట్‌లు(Twitter) జోరుగా వైరల్ అయ్యాయి. తాజాగా, మాజీమంత్రి దేవినేని ఉమా పేరుతో మరో ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో దేవినేని ఉమ స్వయంగా రంగంలోకి దిగారు. తన పేరుతో నకిలీ ట్వీట్ సృష్టించి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నకిలీ ట్వీట్‌ను ప్రచారంలో పెట్టిన మంత్రి అంబటి రాంబాబుపై, సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ నకిలీ ట్వీట్‌ను తనతోపాటు అనేక మందికి పంపిన మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని టీడీపీ లీడర్ దేవినేని ఉమ డిమాండ్ చేశారు. పవన్‌ను విమర్శిస్తూ తాను ట్వీట్ చేసినట్లు ఒక ఫేక్ ట్వీట్ వైరల్ చేశారని ఆరోపించారు దేవినేని ఉమ. అంబటి రాంబాబు వర్సెస్ దేవినేని ఉమ కథ అలా ఉంటే, పదోతరగతి ఫలితాల గురించి ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా లోకేష్ విమర్శలు గుప్పించారు. వెంటనే రియాక్ట్ అయిన విజయసాయి రెడ్డి, లోకేశ్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తమ యువనేతకు కౌంటరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యన్నపాత్రుడు.. విజయసాయి ట్వీట్ ఘాటు రిప్లై ఇచ్చారు. ఇలా, ఒకరిపై ఒకరు ట్వీట్లతో విరుచుకుపడటంతో, ఏపీ పాలిటిక్స్ మరింత హాట్‌హాట్‌గా మారాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి