Andhra Pradesh: నాడు-నేడు అంటే లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవడమా.?.. ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

ఈ ఏడాది పదో తరగతి ఫలితాలు దారుణంగా పడిపోయాయి. గత 20 ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా భారీగా తగ్గిపోయిన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా వరకు విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఈ క్రమంలో...

Andhra Pradesh: నాడు-నేడు అంటే లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవడమా.?.. ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్
Chandrababu
Follow us
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Updated on: Jun 08, 2022 | 10:43 AM

ఈ ఏడాది పదో తరగతి ఫలితాలు దారుణంగా పడిపోయాయి. గత 20 ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా భారీగా తగ్గిపోయిన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా వరకు విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఈ క్రమంలో టెన్త్ రిజల్స్టపై(Tenth Results) టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్షల్లో తప్పామని ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. ధైర్యంగా ఉండాలని, వ్యవస్థలో లోపాలకు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. టీడీపీ పాలనలో 90-95 శాతం ఉన్న పాస్ పర్సంటేజ్.. ఇప్పుడు 67 శాతానికి పడిపోవడం రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ దుస్థితికి నిదర్శనమని మండిపడ్డారు. జగన్ చెప్పిన నాడు-నేడు అంటే లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడమేనా? అని ప్రశ్నించారు. ఫెయిల్ అయ్యింది(Andhra Pradesh) ప్రభుత్వ వ్యవస్థలే, గానీ విద్యార్థులు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు.. గ్రూపు రాజకీయాలతో పార్టీకి నష్టం చేసేవారిని ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. నేతల పనితీరులో నెలలో మార్పు రావాల్సిందేనని కోరారు.

రాష్ట్రంలో విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 6,21,799 మంది హాజరుకాగా 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 67.72 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. వీరిలో బాలురు 64.02 శాతం, బాలికలు 70.70 శాతం పాస్‌ అయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 78.30 శాతం మంది, అత్యల్పంగా అనంతపురంలో 49.70 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు మొత్తం 11,751 స్కూళ్లకు చెందిన విద్యార్థులు హాజరుకాగా వీటిలో 797 పాఠశాలల్లో నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, 71 స్కూళ్లలో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులకు జూలై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే