AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ycp vs Tdp: టీడీపీకి డబుల్ షాక్.. పార్టీకి గుడ్‌బై చెప్పిన ఇద్దరు కీలక నేతలు.. వారెవరంటే..!

Ycp vs Tdp: తెలుగుదేశం పార్టీకి డబుల్ షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు. టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు.

Ycp vs Tdp: టీడీపీకి డబుల్ షాక్.. పార్టీకి గుడ్‌బై చెప్పిన ఇద్దరు కీలక నేతలు.. వారెవరంటే..!
Shiva Prajapati
|

Updated on: Jan 27, 2022 | 6:12 PM

Share

Ycp vs Tdp: తెలుగుదేశం పార్టీకి డబుల్ షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు. టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు శోభా హైమావతి, మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్ని శ్రీను కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీను.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వాన్ని, ఆయన సంక్షేమ పాలన చూసి ఆకర్షితులై మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, మాజీ పార్లమెంటు సభ్యులు డీవీజీ శంకరరావు కూడా పార్టీలో చేరారని అన్నారు. తమ ప్రాంతంలో అనేక సంక్షేమ, అబివృద్ది కార్యక్రమాలు చేస్తున్నందుకు వారు తమ పార్టీలో చేరారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయి అబివృద్ది జగన్ సారథ్యంలోనే జరుగుతోందన్నారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళల పట్ల అవలంబిస్తున్న విధానాలు, వారి సంక్షేమం కోసం చేస్తున్న కృషికి ఆకర్షితురాలినయ్యానని పేర్కొన్నారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్ ఇస్తూ గౌరవిస్తున్నారని ముఖ్యమంత్రి విధానాలను కొనియాడారు. అంతేకాకుండా 90 లక్షల మంది మహిళలకు ఆసరా ఇస్తున్నారని, కింది స్థాయిలో ఉన్న వారికి కూడా ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని అన్నారు. గతంలో ఒక్క ట్రైబల్ మినిస్టర్ కూడా లేరని, ఇప్పుడు ఒక ట్రైబల్ మహిళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, ఇది వైఎస్ జగన్‌కు మాత్రమే దక్కిన ఘనత అని పేర్కొన్నారు. తాము కోరుకుంటున్న పరిపాలన జగన్ అందిస్తున్నందున వైసీపీలో చేరామని అన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేస్తామని శోభా హైమావతి అన్నారు. ఆయన ఆప్యాయతతో కూడిన పలకరింపు తమకు చాలా ఆనందంగా ఉందన్నారు.

డీవీజీ శంకరరావు మాట్లాడుతూ.. గతంలోనే విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరానని అన్నారు. అయితే, ఇవాళ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశానని తెలిపారు. ట్రైబర్ ఏరియాలో విద్య, వైద్యం కోసం సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఒక సామాన్యుడికి భరోసా వచ్చిందంటే.. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వళ్లే సాధ్యం అని అన్నారు.

Also read:

Watch Video: ఛీ.. సాటి మహిళలే దారుణానికి ఒడిగట్టారు.. యువతిపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత..

Telangana: అక్కడి పేదలకు గుడ్ న్యూస్.. ప్రారంభోత్సవానికి సిద్దమైన 15,600 డబుల్ బెడ్‌రూం ఇళ్లు

India-Central Asia Summit: ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. మధ్య ఆసియా సదస్సులో ప్రధాని మోడీ..