AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Central Asia Summit: ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. మధ్య ఆసియా సదస్సులో ప్రధాని మోడీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం భారత్-మధ్య ఆసియా తొలి సదస్సుకుఆతిథ్యం ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. భారతదేశం- మధ్య ఆసియా దేశాల మధ్య దౌత్య సంబంధాలు 30 ఫలవంతమైన సంవత్సరాలను పూర్తి..

India-Central Asia Summit: ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. మధ్య ఆసియా సదస్సులో ప్రధాని మోడీ..
Pm Narendra Modi
Sanjay Kasula
|

Updated on: Jan 27, 2022 | 5:47 PM

Share

India-Central Asia Summit: ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం అభిప్రయపడ్డారు. మధ్య ఆసియా తొలి సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. భారతదేశం- మధ్య ఆసియా దేశాల మధ్య దౌత్య సంబంధాలు 30 ఫలవంతమైన సంవత్సరాలను పూర్తి చేశాయని అన్నారు. గత మూడు దశాబ్దాలలో మా సహకారం అనేక విజయాలను సాధించింది. ఇప్పుడు ఈ కీలక దశలో రాబోయే సంవత్సరాల్లో కూడా మనం ప్రతిష్టాత్మకమైన దృక్పథాన్ని నిర్వచించాలని ఆయన అన్నారు. ప్రాంతీయ భద్రతకు సంబంధించి మనందరికీ ఒకే విధమైన ఆందోళనలు, లక్ష్యాలు ఉన్నాయన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలపై మేమంతా ఆందోళన చెందు తున్నామన్నారు.

 ఆఫ్ఘనిస్తాన్ గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ..  ప్రాంతీయ భద్రత , స్థిరత్వానికి మన పరస్పర సహకారం మరింత ముఖ్యమైనదని అన్నారు. మన సహకారానికి సమర్థవంతమైన నిర్మాణాన్ని అందించడమే రెండవ లక్ష్యం అని ఆయన అన్నారు. ఇది వివిధ స్థాయిలలో వివిధ వాటాదారుల మధ్య నిరంతర సంభాషణ కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది. మా సహకారం కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించడం మూడవ లక్ష్యం. సమీకృత, స్థిరమైన పొరుగు దేశం భారతదేశ దృష్టికి మధ్య ఆసియా కేంద్రమని భారతదేశం తరపున నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. నేటి శిఖరాగ్ర సదస్సు మూడు ప్రధాన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంది.

మధ్య ఆసియాలో భారత్ బలోపేతం 

మధ్య ఆసియాలో పెరుగుతున్న చైనా కార్యకలాపాలను ఆపాలన్నది భారత్‌ ఉద్దేశం. ఇటీవల, చైనా ఈ ప్రాంతంలో సహాయంగా $ 500 మిలియన్ల సహాయాన్ని పంపింది. ఇప్పటివరకు భారతదేశం-మధ్య ఆసియా సంభాషణలో విదేశాంగ మంత్రుల స్థాయిలో ఐదు దేశాలతో భారతదేశం సమావేశ యంత్రాంగాన్ని జరిగింది. గత నెల, న్యూఢిల్లీ ఈ ఫార్మాట్‌లో మూడో సమావేశానికి కూడా ఆతిథ్యం ఇచ్చింది. అదనంగా, మొత్తం ఐదు మధ్య ఆసియా దేశాల జాతీయ భద్రతా అధికారులు నవంబర్ 2021లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఢిల్లీ ప్రాంతీయ భద్రతా సంభాషణలో పాల్గొన్నారు. అదే సమయంలో కరోనా ముప్పు లేకుండి ఉంటే.. రిపబ్లిక్ డే పరేడ్‌కు కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులు ముఖ్య అతిథిగా భారతదేశానికి వచ్చి ఉండేవారు.

మధ్య ఆసియాపై చైనా ఎందుకు ఆసక్తి చూపుతోంది

అదే సమయంలో మధ్య ఆసియాలో భారతదేశం పెరుగుతున్న శక్తి కారణంగా చైనాలో కలకలం రేగుతోంది. అందుకే చైనా ఇక్కడ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. చైనా ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా, ఆర్థికంగా ముఖ్యమైనదిగా పరిగణిస్తుంది. ఎందుకంటే ఇది దాని బెల్ట్.. రోడ్ ఇనిషియేటివ్‌కు చాలా ముఖ్యమైనది. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఈ ప్రాంతంలోని దేశాల నుండి మరింత నాణ్యమైన వస్తువులు.. వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటామని.. 2030 నాటికి ఇరుపక్షాల మధ్య వాణిజ్యాన్ని 70 బిలియన్ డాలర్లకు పెంచడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. 2018 నాటికి ఐదు మధ్య ఆసియా దేశాలతో చైనా వాణిజ్యం 40 బిలియన్ డాలర్లు దాటింది.

ఇవి కూడా చదవండి: PRC: చ‌ర్చ‌లకు రండి.. మీరు మా శ‌త్రువులు కాదు.. ఉద్యోగులకు ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల సూచన..

TATA – Air India: ఎగిరిపో ఆకాశమే హద్దుగా.. టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా..