AP Corona: కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు పలు సూచనలు..
రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం తీసుకోవాలసిన చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను అధికారులు..
CM YS Jagan Review: రాష్ట్రంలో కరోనా(Corona) కట్టడి కోసం తీసుకోవాలసిన చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan) సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను అధికారులు ఆయనకు వివరించారు. రాష్ట్రంలో 1.06 లక్షలకుపైగా కేసుల్లో కేవలం 2,709 మందే ఆస్పత్రుల్లో చేరారని వారు పేర్కొన్నారు. ఇందులో ఐసీయూలో చేరినవారు కేవలం 287 మందేనని అధికారులు పేర్కొన్నారు. 18 ఏళ్లపైబడినవారికి 90.34 శాతం వ్యాక్సినేషన్ పూర్తైందన్నారు. 15 నుంచి 18 ఏళ్ల మధ్యనున్నవారికి 98.91 శాతం మొదటి డోస్ పూర్తైందన్నారు. జిల్లాల్లో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
కరోనా సమీక్షతోపాటు వైద్య ఆరోగ్యశాఖలో జనరల్ బదిలీలకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు.. ఫిబ్రవరి నాటికి ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో సిబ్బంది ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ ఇచ్చారు. ఆలోగా కొత్త రిక్రూట్‌మెంట్లను కూడా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
వైద్యం పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా కోవిడ్ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు రంగాలలోని ఆస్పత్రులను కూడా దీనికి సిద్ధంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ఉధృతం చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ చేయాలన్నారు. ఫీవర్ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే.. వారికి టీకాలు వేయాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో 6 ఒమిక్రాన్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. వీరిలో ఎవరు కూడా ఆస్పత్రిపాలు కాలేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి: PRC: చర్చలకు రండి.. మీరు మా శత్రువులు కాదు.. ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల సూచన..
TATA – Air India: ఎగిరిపో ఆకాశమే హద్దుగా.. టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా..