Kolleru Pollution: గతమెంతో ఘనం.. ప్రస్తుతం గరళ మయం.. ఇదీ ఏపీలోని కొల్లేరు దుస్థితి..
Kolleru Pollution: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తరించి ఉన్న కొల్లేరు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరంటే..
Kolleru Pollution: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తరించి ఉన్న కొల్లేరు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రకృతి రమణీయతకు, అంతులేని అద్భుతాలకు అందాల గని కొల్లేరు. అరుదైన పక్షుల పలకరింపులు.. చేప పిల్లలు సందడులు.. నీటి ప్రవాహ సవ్వడులు.. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోవాలే గానీ సమయం సరిపోదు. అంతటి అందం కొల్లేరు సరస్సు సొంతం. అయితే, ఈ కొల్లేరు అందాలన్నీ గతం.. ప్రస్తుతం గరళ మయంగా మారింది. కొల్లేరు అందానికి కారణమై విదేశీ పక్షుల పాలిట స్మశానంలా మారింది.
వాస్తవానికి కొల్లేరుకు యూరప్, ఉత్తర ఆసియా దేశాల నుంచి వివిధ జాతుల పక్షులు వలస వస్తుంటాయి. ప్రతీ ఏటా ఆగస్టు నెల నుంచి మార్చి వరకు ఇక్కడికి ప్రయాణించి వస్తాయి. ఇక్కడే గూడు ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తి చే స్తాయి. ప్రభుత్వాల లెక్కల ప్రకారం ఏటా 2 లక్షలకు పైగా విదేశీ పక్షులు కొల్లేరు సరస్సుకు వస్తుంటాయి. ఈ కారణంగానే కొల్లేరులోని ఆటపాక పక్షుల కేంద్రంలో ఎటు చూసినా పక్షులే కనిపిస్తాయి. ఆ పక్షుల కిలకిలరావాలు, వాటి సందడి ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడే పెరిగే గ్రే పెలికాన్లు, ఆసియా ప్రాంతపు ఓపెన్ బిల్లుడ్ స్టార్క్ప్, రంగురంగుల స్టార్క్ప్, గ్లోసీ ఇబిసెస్, తెల్లటి ఇబిసెస్, టేల్స్, పిన్‌టైల్స్, షోవేలార్స్, ఇతర దేశాల నుంచి వచ్చే వలస పక్షులు రెడ్ క్రెస్టెడ్ పాచార్డ్స్, నలుపు రెక్కలుండే స్టిల్ట్స్, అవోసెట్స్, కామన్ రెడ్ షాంక్స్, కార్మోరెంట్స్, గార్గ్‌నీస్, హెరాన్స్, ఫ్లెమింగోలు కనువిందు చేస్తుంటాయి. ఈ అందమైన పక్షులను చూసేందుకే పర్యాటకులు పెద్ద ఎత్తున కొల్లేరుకు వస్తారు. పక్షులతో నిండుగా కళకళలాడే సరస్సును చూసి పర్యాటకులు మంత్రముగ్దులైపోతుంటారు.
అయితే, ప్రస్తుతం కొల్లేరు సరస్సుకు పక్షుల పాలిట పాశానంలా మారింది. పరిశ్రమల నుంచి విడులయ్యే కాలుష్య కాసారాలన్నీ సరస్సులో చేరి గరళమయం అవుతోంది. అంతేకాదు.. వర్షాల కారణంగా పలు ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీరు సైతం ఇందులో చేరుతుండటంతో నీరంతా విషతుల్యం అవుతోంది. ఫలితంగా అక్కడ నివసించే విదేశీ పక్షులన్నీ చనిపోతున్నాయి. విదేశీ పక్షులు చనిపోవడాన్ని చూసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు కాలుష్యమయం అవకుండా చర్యలు తీసుకోవాలని, పక్షులు మృత్యువాత పడుకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు.
Also read:
Stock Market: ముహూరత్ ట్రేడింగ్ అంటే తెలుసా.. అది ఎప్పుడు నిర్వహిస్తారంటే..
Paytm IPO: త్వరలో పేటీఎం ఐపీఓ.. ఎప్పుడు వస్తుందంటే..
Weight Loss: అధిక బరువుతో బాధ పాడుతున్నారా? కీరాతో బరువు తగ్గడం చాలా ఈజీ.. కానీ..