AP MLC elections: ఏపీ స్థానికసంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
AP MLC elections 2021: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ్టి నుంచి నుంచి ఈనెల 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. నవంబర్ 26 నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ. ఇక, ఈ స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగనుంది.
ప్రస్తుతం అనంతపురం 1, కృష్ణ-2, కర్నూలు1, తూర్పుగోదావరి 1, గుంటూరు 2, విజయనగరం1, విశాఖపట్నం-2, చిత్తూరు1, ప్రకాశం జిల్లాలోని 1 ఖాళీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. డిసెంబరు 10 తేదీన పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 16 డిసెంబర్ న కౌంటింగ్ చేపట్టనున్నట్టు తెలిపిన ఎన్నికల కమిషన్.. నోటిఫికేషన్ జారీ అయిన దృష్ట్యా ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని పేర్కొంది. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. సీఎం జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం అందజేశారు. పాలవలస విక్రాంత్ (శ్రీకాకుళం), ఇసాక్ బాషా(కర్నూలు), డీసీ గోవిందరెడ్డి(కడప) ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నారు.