Andhra Pradesh: ఆ తరువాతే పదవ తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఏపీ విద్యాశాఖ మంత్రి..
Andhra Pradesh: కరోనా కారణంగా రద్దయిన టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సురేష్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం..
Andhra Pradesh: కరోనా కారణంగా రద్దయిన టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సురేష్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాతే పదవ తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాలను వెల్లడిస్తామని మంత్రి సురేష్ తెలిపారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలోని కమిటీ మరో పది రోజుల్లో ఫలితాల మదింపు విధానాన్ని నివేదించనుందన్నారు. ఈ నివేదిక ప్రభుత్వానికి అందిన రెండు, మూడు రోజుల్లోనే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇదిలాఉంటే.. 2021-22 విద్యా సంవత్సరాన్ని ఆగస్టు రెండో వారంలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి సురేష్ వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. సెట్స్ పరీక్షలు ఆగస్టు నెలలో యధాతథంగా జరుగాయని చెప్పారు.
కాగా, పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదట్లో విశ్వ ప్రయత్నాలు చేసింది. అయితే, పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవడం.. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగాయి. పరీక్షలు నిర్వహించడానికి సుప్రీంకోర్టు అనేక కండీషన్లు పెట్టడం.. వివాదం మరింత ముదురుతుండటంతో.. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను రాష్ట్ర సర్కార్ రద్దు చేసింది. పరీక్షలు లేకుండా విద్యార్థులకు మార్కులు వేస్తామని ప్రకటించింది. అయితే, మార్కులను ఏ ప్రాతిపదికన వేయాలనే దానిపై మదింపు కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కమిటీ త్వరలోనే తన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. నివేదిక అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలను వెల్లడించనుంది.
Also read:
Parliament Monsoon Session: జూలై 19 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. తేదీలను ఖరారు చేస్తూ నోటిఫికేషన్
Gun Fire: శుభకార్యాల్లో పెచ్చుమీరుతున్న గన్ కల్చర్.. వివాహ వేడుకలో విషాదం.. వరుడి సోదరుడు మృతి